News March 3, 2025
కొత్తగూడెం: పీడీఎస్యూ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

నేడు ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థ ప్రైవేటుపరం చేసి కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు అన్నారు. కొత్తగూడెం కార్యాలయంలో సోమవారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శ్యామ్, ప్రధాన కార్యదర్శిగా ప్రణయ్ కుమార్, ఉపాధ్యక్షుడిగా రాజేశ్, సహాయ కార్యదర్శిగా వెంకటేశ్, కోశాధికారిగా భాస్కర్తో పాటు 11 మంది కమిటీని ఎన్నుకున్నామని తెలిపారు.
Similar News
News March 4, 2025
సంగారెడ్డి: వారం రోజుల్లో పెళ్లి.. యువకుడి ఆత్మహత్య

వారం రోజుల్లో పెళ్లి జరగాల్సిన యువకుడు మంజీరా నదిలోకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. నాగల్ గిద్ద మండలం కరస్ గుత్తి గ్రామానికి చెందిన అనిల్ (21) మూడు రోజులుగా కనిపించడం లేదు. కుటుంబ సభ్యులు వెతికితే మంజీరా నదిలో శవమై కనిపించాడు. యువకుని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. వారం రోజుల్లో పెళ్లి ఉండగా.. ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
News March 4, 2025
సిద్దిపేట: తైక్వాండో విద్యార్థుల ఉత్తమ ప్రతిభ

మార్చి 1, 2 తేదీలలో హైదరాబాదులోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన 13వ ఓపెన్ స్టేట్ లెవెల్ ఇంటర్ స్కూల్స్ తైక్వాండో ఛాంపియన్షిప్లో సిద్దిపేట జిల్లా తైక్వాండో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి 12 మెడల్స్ సాధించారని తైక్వాండో కార్యదర్శి మాస్టర్ శ్రీనివాస్ తెలిపారు. మెడల్స్ సాధించిన విద్యార్థులను సిద్దిపేట జిల్లా తైక్వాండో అధ్యక్షుడు రాధాకృష్ణశర్మ, ఉపాధ్యక్షుడు రామ్మోహన్ అభినందించారు.
News March 4, 2025
డీజేలు పెడితే జైలుకే: వరంగల్ ఏసీపీ

వరంగల్ నగర ప్రజలకు ఏసీపీ నందిరం నాయక్ కీలక సూచనలు చేశారు. వివాహ, ఇతర వేడుకల్లో డీజే సౌండ్స్ పెట్టే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. DJలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇంటర్మీడియట్, SSC, ఇతర పోటి పరీక్షలు ఉన్నందున వివాహ ఊరేగింపు, ఇతర వేడుకల్లో DJ సౌండ్స్ పెట్టి విద్యార్థులు, వృద్ధులు, చిన్నపిల్లలు, ప్రజలకి ఇబ్బంది కలిగించవద్దన్నారు. DJ ఆపరేటర్లు, యజమానులపై కేసు నమోదు చేస్తామన్నారు.