News March 11, 2025
కొత్తగూడెం: ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.
Similar News
News March 11, 2025
ఆ కారు ఉత్పత్తిని ఆపేయనున్న మారుతీ?

తమ సెడాన్ కారు సియాజ్ ఉత్పత్తిని ఇకపై ఆపేయాలని మారుతీ సుజుకీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2014లో ఆ కారును సంస్థ తీసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా సియాజ్‌కు ఆదరణ బాగా తగ్గింది. ఈ ఏడాది కేవలం 7726 యూనిట్లను మాత్రమే విక్రయించింది. మరోవైపు పోటీ సంస్థల నుంచి సిటీ, విర్చస్, స్లేవియా, వెర్నా వంటి కార్లు దూసుకెళ్తుండటంతో సియాజ్ ఉత్పత్తిని ఇక నిలిపేయాలని సంస్థ నిర్ణయించినట్లు సమాచారం.
News March 11, 2025
అనర్హులని తేలితే ఏదశలో ఉన్నా ఇల్లు రద్దు చేస్తాం: మంత్రి పొంగులేటి

తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఎంపిక చేసి పనులు ప్రారంభించామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా పనులు ప్రారంభించామని.. లబ్ధిదారులు అనర్హులని తేలితే నిర్మాణం ఏ దశలో ఉన్నా ఎలాంటి ఆలోచన లేకుండా ఇల్లు రద్దు చేస్తామని తేల్చిచెప్పారు.
News March 11, 2025
బడిలో బాలిక మృతి.. ITDA PO వివరణ ఇదే

ఇచ్చోడ బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలిక మృతపై ITDA PO కుష్బూ గుప్తా వివరణ ఇచ్చారు. బాలికకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవన్నారు. ఇటీవల వైద్య శిబిరంలోనూ ఆమెకు పరీక్షలు చేయగా ఎలాంటి సమస్యలు ఉన్నట్లు తేలలేదన్నారు. డాక్టర్ల ప్రాథమిక అభిప్రాయం ప్రకారం విద్యార్థిని శ్వాసకోస సంబంధిత సమస్యతో మృతి చెంది ఉండవచ్చని పేర్కొన్నారు. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చిన తరువాత పూర్తి వివరాలు తెలియజేస్తామని వెల్లడించారు.