News September 18, 2025
కొత్తగూడెం: ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని వినతి

జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని TTSF, GVS నాయకులు కోరారు. గురువారం డీఈఓకు వినతిపత్రం అందజేశారు. టీటీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మంగీలాల్, జీవీఎస్ కార్యదర్శి బాలాజీ నాయక్, జానకీరామ్ మాట్లాడుతూ.. ప్రైవేటు విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. విద్యా హక్కు చట్టాలకు విరుద్ధంగా నడుపుతున్న స్కూల్స్‌పై చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News September 18, 2025
బతుకమ్మ, దసరా పండుగకు 7,754 ప్రత్యేక బస్సులు

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా TGSRTC 7,754 ప్రత్యేక బస్సులను సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 2 వరకు నడపనుంది. అందులో 377 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. MGBS, JBS, CBSతో పాటు KPHB, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి బస్సులు నడుస్తాయి. అక్టోబర్ 5, 6 తేదీల్లో తిరుగు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కూడా బస్సులను TGSRTC ఏర్పాటు చేయనుంది.
News September 18, 2025
సంతబొమ్మాళి: మూలపేట పోర్టులో కార్మికుడు మృతి

సంతబొమ్మాళి (M)మూలపేట పోర్టులో పనిచేస్తున్న కార్మికుడు పింగ్వా(36) గురువారం మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం..జార్ఖండ్‌కు చెందిన పింగ్వా రెండు వారాల కిందట మూలపేట పోర్ట్‌లో కూలీగా పని చేసుందుకు వచ్చాడని, గత మూడు రోజులగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడని చెప్పారు. దీనిపై ఎస్సై నారాయణాస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
News September 18, 2025
KNR: ‘పని ప్రదేశాల్లో ఫిర్యాదుల కమిటీ తప్పనిసరి’

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టంపై జెడ్పీ సమావేశ మందిరంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ సభ్యులకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కంపెనీలు, కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నివారణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయడం తప్పనిసరి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.