News February 15, 2025
కొత్తగూడెం : బీర్ల ధరల పెంపు.. రూ.100 కోట్ల ఆదాయం

బీర్ల ధరలను 15 నుంచి 20 శాతం పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో ఒక బీరుపై గరిష్ఠంగా రూ.30 పెరిగింది. దీంతో మద్యం ప్రియులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 12న ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అదనంగా రూ.100 కోట్ల ఆదాయం పెరగనుంది.
Similar News
News February 21, 2026
మెదక్: మీడియా అక్రిడేషన్ కమిటీ ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

జిల్లాలోని మీడియా ప్రతినిధులకు 2026-28 సంవత్సరాలకు కొత్త అక్రిడిటేషన్‌ల జారీ కోసం నూతన జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ (DMAC) ఏర్పాటుకు చర్యలు ప్రారంభించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ (DMAC)లో సభ్యత్వం పొందేందుకు జీఓ 252 ప్రకారం జిల్లాలోని మీడియా అసోసియేషన్లు, సంఘాలు తమ ప్రతినిధి పేరును లెటర్ ప్యాడ్‌పై రాసి ఈనెల 23న ఉదయం 11 గంటలలోపు అందజేయాలని సూచించారు.
News February 21, 2026
నిర్మల్: ఆమె చేతికే పాలన పగ్గాలు..!

నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో మహిళా కౌన్సిలర్లు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. మొత్తం 80 వార్డులకు గాను ఏకంగా 43 చోట్ల మహిళలు విజయం సాధించగా, 37 మంది పురుషులు ఎన్నికయ్యారు. నిర్మల్ మున్సిపల్ పీఠం మహిళకే దక్కగా, భైంసా, ఖానాపూర్ స్థానాలు జనరల్‌కు కేటాయించారు. జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో మహిళా కౌన్సిలర్ల సంఖ్యే ఎక్కువగా ఉండటం విశేషం. పాలనలో మహిళలు కీలక పాత్ర పోషించనున్నారు.
News February 21, 2026
విశాఖ కేజీహెచ్‌లో కలకలం.. కుళ్లిన పసికందు మృతదేహం లభ్యం

కేజీహెచ్‌లో మరోసారి కలకలం రేగింది. శనివారం సూపరింటెండెంట్ కార్యాలయం పక్కన కుళ్లిపోయిన పసికందు మృతదేహం కనబడటంతో ఉద్యోగులు, రోగులు భయందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న కేజీహెచ్ సిబ్బంది పసికందు మృతదేహం గురించి ఆరా తీస్తున్నారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


