News August 21, 2025
కొత్తగూడెం: ‘మార్వాడీలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు’

కొత్తగూడెంలో బుధవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బొమ్మెర శ్రీనివాస్ మాట్లాడారు. తెలంగాణలో మార్వాడీలు ఏకమై స్థానిక వ్యాపారాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. వ్యాపారం కోసం వచ్చిన మార్వాడీలు రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని, ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారన్నారు. పలు చోట్ల ఉన్న ‘మార్వాడీ గో బ్యాక్’ నినాదం నేడు కొత్తగూడెంకు పాకడం గమనార్హం.
Similar News
News August 21, 2025
సిబిల్ స్కోర్ లేకపోతే నో జాబ్.. కేంద్రం క్లారిటీ

IBPS సెలక్షన్ ప్రక్రియలో అభ్యర్థులు సిబిల్ స్కోర్ పొందుపరచాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. కానీ బ్యాంకులో ఉద్యోగంలో చేరే సమయంలో క్రెడిట్ స్కోర్ చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సిబిల్ రికార్డు అప్డేటెడ్‌గా లేకుంటే బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి NOC తీసుకోవాలని సూచించారు. ఆర్థికపరమైన క్రమశిక్షణ కలిగిన వారినే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని బ్యాంకులు కోరుకుంటున్నట్లు తెలిపారు.
News August 21, 2025
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

TG: సీఎం రేవంత్ ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ఆయన ఢిల్లీకి పయనమవుతారు. ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత పలువురు కీలక నేతలతో రేవంత్ భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
News August 21, 2025
మోసపూరిత APK ఫైల్స్ పట్ల జాగ్రత్త: ఎస్పీ

మోసపూరిత APK ఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా బుధవారం సూచించారు. WhatsAppలో సైబర్ నేరగాళ్లు మోసపూరితమైన PM KISAN YOJANA, ఐసీసీ బ్యాంక్ క్రెడిట్ కార్డు Apk, SBI ekyc.apk, యోనా SBL.apk వంటి ఫైల్స్ పంపుతున్నారని తెలిపారు. వీటిని క్లిక్ చేయడం వల్ల ఫోన్లలో ఉన్న వ్యక్తిగత సమాచారం దొంగలించే అవకాశం ఉందన్నారు. ఇటువంటి apk పైల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.