News July 7, 2025
కొత్తగూడెం: ‘మీకు దండం పెడతాం.. మాకు స్కూల్ కావాలి’

బూర్గంపహాడ్ మండలం శ్రీరాంపురం విద్యార్థులు తమ గ్రామంలో పాఠశాల లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. 15 మందికి పైగా విద్యార్థులు చదువుకునేందుకు సూదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేదని, చదువుకునేందుకు స్కూల్‌కి వెళ్లడానికి నరకయాతన పడుతున్నామన్నారు. అధికారులు స్పందించి స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Similar News
News July 7, 2025
అనామకులతో అప్రమత్తంగా ఉండాలి: SP

మీ రక్షణే మా భద్రతగా నెల్లూరు పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. నెల్లూరు బారాషహిద్ దర్గాలో రెండో రోజు కొనసాగుతున్న రొట్టెల పండుగలో పోలీసు బందోబస్తు, గంధ మహోత్సవానికి చేసిన ఏర్పాట్లను ఆయన పోలీసు అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. రాత్రికి జరగనున్న ప్రధాన ఘట్టం అయిన గంధ మహోత్సవానికి పగడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అనామకులతో అప్రమత్తంగా ఉండాలన్నారు.
News July 7, 2025
ఈ లక్షణాలను వెంటనే విడిచిపెట్టేయ్ మిత్రమా!

ప్రతి విషయానికీ ఎక్కువగా ఆలోచించే ఓ మిత్రమా.. ఇది నీకోసమే. నువ్వు మొదటగా ఈ 5 లక్షణాలను విడిచిపెడితే నీ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుంది. తొలుత అందరినీ సంతృప్తి పరచాలని అనుకోకు. జరిగినవి, జరగబోయే విషయాలపై అనవసరంగా ఆందోళన చెందకు. ముందుగా నిన్ను నువ్వు కించ పరుచుకోవడం మానేసేయ్. మార్పులకు భయపడకుండా ధైర్యంగా నిలబడు. గతాన్ని వదిలేసి భవిష్యత్తుపై దృష్టి పెట్టు. SHARE IT
News July 7, 2025
మాగనూర్: ప్రేమ పేరుతో మోసం… యువకుడిపై కేసు

ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకోమంటే యువకుడు మోసం చేసిన సంఘటన మగనూర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై అశోక్ బాబు కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన నరేశ్ కొంతకాలంగా ప్రేమిస్తున్నట్లు నమ్మించి గర్భం చేశాడు. పెళ్లి చేసుకోకపోవడంతో నిరాకరించడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదైంది.