News October 23, 2024

కొత్తగూడెం: రాష్ట్రంలో ఎటు చూసినా ఇబ్బంది వాతావరణం: కూనంనేని 

image

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎటు చూసినా ఇబ్బంది వాతావరణం కనిపిస్తోందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరికీ ఒకే అజెండా ఉందని, అందుకే ఈ ప్రభుత్వం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. వారి ఆస్తులు పరిరక్షించుకోవడం కోసం పెద్ద ఎత్తున రభస చేస్తున్నారని, రాబందుల్లా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యానించారు.

Similar News

News November 10, 2025

పాత కక్షలతో హత్య.. ఇద్దరు నిందితులు అరెస్టు

image

ఎదులాపురం ముత్తగూడెంకు చెందిన బురా శ్రీనివాస్‌ను పాత కక్షల నేపథ్యంలోనే హత్య చేసినట్లు రూరల్ సీఐ ఎం. రాజు తెలిపారు. బురా డేవిడ్, పేరెల్లి రాజశేఖర్ సుపారీ మాట్లాడుకుని శ్రీనివాస్‌ను కారులో కిడ్నాప్ చేసి, గొంతు నులిమి చంపి, మృతదేహాన్ని ఎన్ఎస్‌పీ కెనాల్‌లో పడేశారని సీఐ వెల్లడించారు. భార్య ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

News November 8, 2025

ఖమ్మం: కడుపునొప్పి తాళలేక కార్మికుడి ఆత్మహత్య

image

తీవ్రమైన కడుపునొప్పిని భరించలేక మిషన్ భగీరథలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికుడు తగరం నాగరాజు (36) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం గ్రామంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాగరాజు ఉరివేసుకున్నాడు. ఈ విషయం స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 8, 2025

ఖమ్మం: గన్ని సంచుల కొరత లేదు: అదనపు కలెక్టర్

image

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు గన్ని సంచులు సమృద్ధిగా ఉన్నాయని, ప్రతిపాదనలు పంపిన 48 గంటల్లోనే సరఫరా జరుగుతోందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలకు 9,71,500 గన్ని సంచులు పంపిణీ చేశామన్నారు. రైతుల ఇళ్లకు సంచులు ఇవ్వవద్దని స్పష్టమైన ఆదేశాలున్నాయని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచులు, టార్పాలిన్ కవర్లు సమృద్ధిగా ఉన్నాయన్నారు.