News March 5, 2025
కొత్తగూడెం: రూ.10.30లక్షల గంజాయి పట్టివేత

భద్రాచలం పట్టణంలోని ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద మంగళవారం టౌన్ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో 2 ద్విచక్ర వాహనాలపై వస్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద రూ.10.30 లక్షలు విలువ గల 20 కేజీల గంజాయి పట్టుబడింది. గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా భద్రాచలంలో పట్టుకున్నట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. వీరంతా సుక్మా జిల్లాకు చెందిన వారిగా విచారణలో తేలిందని ఎస్ఐ పేర్కొన్నారు.
Similar News
News February 25, 2026
OBC సర్టిఫికెట్ ఇలా అప్లై చేసుకోండి

TG: విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు OBC సర్టిఫికెట్ ఎంతో కీలకం. ఇందుకోసం కొన్ని డాక్యుమెంట్లతో మీసేవా సెంటర్లలో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫారం, ఐడీ&అడ్రస్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ ప్రూఫ్, పాత కాస్ట్(కుల ధ్రువీకరణ)& ఇన్‌కమ్ సర్టిఫికెట్, అఫిడవిట్ సమర్పించాలి. అప్లికేషన్ ఫీజు రూ.45.
Share It
News February 25, 2026
తెలుగు యూట్యూబర్ ఆత్మహత్య

తెలుగు యూట్యూబర్ కోమలి (21) ఆత్మహత్యకు పాల్పడింది. వైజాగ్‌కు చెందిన ఆమె హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ఉంటూ చదువుకుంటోంది. హాబీగా యూట్యూబ్ వీడియోలు చేస్తూ గుర్తింపు పొందింది. సొంతూరికి చెందిన మరో యూట్యూబర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అఖిల్ రెడ్డితో ప్రేమ విఫలం కావడంతో మనస్తాపంతో ఉరి వేసుకొని చనిపోయిందని తెలుస్తోంది. కాగా అఖిల్ మోసం చేయడంతో బలవన్మరణానికి పాల్పడిందని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News February 25, 2026
టారిఫ్‌లపై ట్రంప్ కీలక ప్రకటన

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే దేశాలపై టారిఫ్‌లు విధించానని, వీటికి చట్టబద్ధత ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటించారు. దీనివల్ల US ప్రజలకు పన్నుల భారం తగ్గుతుందన్నారు. టారిఫ్‌ల విషయంలో కోర్టు తీర్పుపై ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నామని తెలిపారు. దురదృష్టవశాత్తూ దేశంలో సుప్రీంకోర్టు నుంచి పాలన సాగుతోందని మండిపడ్డారు. ఏది ఏమైనా అమెరికాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.


