News June 25, 2024
కొత్తగూడెం: వర్షంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో సింగరేణి వ్యాప్తంగా ఓసీల్లో సుమారు 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. రోజుకు 1.60 లక్షల టన్నులకు గాను 1.10లక్షల టన్నుల ఉత్పత్తి మాత్రమే నమోదైంది. కొత్తగూడెం రీజియన్‌లోని ఇల్లెందులో 11వేల టన్నులకు గాను 6వేల టన్నులు, కొత్తగూడెం ఏరియాలో 40వేల టన్నులకు 30వేలు, మణుగూరు ఏరియాలో 35వేల టన్నులకు గాను 25వేల టన్నుల ఉత్పత్తి జరిగినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News February 15, 2026
ఐదు మున్సిపాలిటీలకు కాంగ్రెస్ విప్‌ల నియామకం

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విప్‌లను నియమించినట్లు డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు.. ఏదులాపురానికి దయాకర్ రెడ్డి, మధిరకు ధనికుమార్, వైరాకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కల్లూరుకు ప్రసాద్ రెడ్డి, సత్తుపల్లికి ఎమ్మెల్యే రాగమయిలను విప్‌లుగా ఖరారు చేశారు.
News February 15, 2026
ఖమ్మం: ప్రతి ఇంటికీ తపాలా ఖాతా.. కీలక ఆదేశాలు

ఖమ్మం: తపాలా శాఖ పొదుపు పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా తపాలా సూపరింటెండెంట్ వీరభద్ర స్వామి సిబ్బందిని ఆదేశించారు. ప్రతి ఇంటికీ ఒక పొదుపు ఖాతా ఉండేలా చూడాలని, ముఖ్యంగా ఆడపిల్లల కోసం ‘సుకన్య సమృద్ధి’ పథకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. సర్పంచుల సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో బీమా, డిపాజిట్లపై అవగాహన కల్పించి తపాలా సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు.
News February 15, 2026
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా 3 రోజులు సెలవులు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఆదివారం వారాంతపు సెలవుతో పాటు, సోమవారం (16-02-2026) మహాశివరాత్రి, మంగళవారం అమావాస్య సందర్భంగా మార్కెట్ లావాదేవీలు నిలిపివేయనున్నారు. తిరిగి బుధవారం నుంచి మార్కెట్ యథావిధిగా పనిచేస్తుందని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి, క్రయవిక్రయాల కోసం బుధవారం మార్కెట్‌కు రావాలని అధికారులు కోరారు.


