News February 19, 2025
కొత్తగూడెం: వివాహేతర సంబంధం.. ఇద్దరికి దేహశుద్ధి..!

భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గాండ్లగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పాటు ఖమ్మంపాడుకు చెందిన మరో వ్యక్తిని మంగళవారం సాయంత్రం చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశామని ఖమ్మంపాడు గ్రామస్థులు తెలిపారు. ఖమ్మంపాడులోని ఓ వివాహితతో గాండ్లగూడెం వాసి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని,ఆమె కుటుంబ సభ్యులు గమనించగా ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చేశామని చెప్పారు.అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు.
Similar News
News September 19, 2025
కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లిం మంత్రి, ఎమ్మెల్యే లేరు: కేటీఆర్

TG: వంద రోజుల్లో అన్ని హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. జూబ్లీహిల్స్ BRS కార్యకర్తలతో సమావేశమైన ఆయన మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను గెలిపించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. చరిత్రలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లిం మంత్రి గానీ, ముస్లిం ఎమ్మెల్యే గానీ, ముస్లిం ఎమ్మెల్సీ గానీ లేరని వ్యాఖ్యానించారు.
News September 19, 2025
‘విజయ’ సీటు కోసం వార్..!

నెల్లూరు విజయ డెయిరీ ఛైర్మన్ పదవి కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. 14 ఏళ్లుగా ఛైర్మన్‌గా కొనసాగుతున్న రంగారెడ్డి పదవీ కాలం ఈ నెలతో ముగియనుంది. కీలకమైన ఈ పోస్టు కోసం సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాల నాయకులు పోటీపడుతున్నారు. మొదట సర్వేపల్లికి చెందిన బాబిరెడ్డి పేరు దాదాపు ఖాయమని ప్రచారం జరిగినప్పటికీ కోవూరు, ఆత్మకూరు నేతలు తీవ్రపోటీ ఇస్తున్నారు. ఫైనల్‌గా అదృష్టం ఎవరిని వరిస్తుందో..?
News September 19, 2025
ఈనెల 22న ‘కాంతార-1’ ట్రైలర్

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార-1’ సినిమా ట్రైలర్ విడుదలపై అప్డేట్ వచ్చింది. ఈనెల 22న మధ్యాహ్నం 12.45 గంటలకు ట్రైలర్ రిలీజ్ అవుతుందని ప్రకటిస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా దసరా సందర్భంగా ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించగా హొంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది.