News September 6, 2025
కొత్తగూడెం: సింగరేణిలో టెర్మినేట్ అయిన వారికి అవకాశం

సింగరేణి సంస్థలో వివిధ కారణాలతో తమ ఉద్యోగాలు కోల్పోయిన 43 మంది జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీలకు(JMET) యాజమాన్యం మరో అవకాశం కల్పించింది. సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.బలరామ్ ఆదేశాల మేరకు శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో టెర్మినేట్ అయిన ట్రైనీలు తిరిగి విధుల్లో చేరడానికి మార్గం సుగమమైంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, క్రమశిక్షణతో పనిచేయాలని యాజమాన్యం సూచించింది.
Similar News
News September 6, 2025
భాద్యతగా విధులు నిర్వహించాలి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామ పాలనాధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. కలెక్టరేట్‌లో జరిగిన గ్రామ పాలనాధికారుల కౌన్సెలింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. నియామక పత్రాలు తీసుకున్న అధికారులు బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News September 6, 2025
VKB: ‘కాంగ్రెస్‌పై ప్రేమ ఉంటే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలి’

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉపాధ్యాయులను కోరడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే డా.మెతుకు ఆనంద్ విమర్శించారు. కాంగ్రెస్‌పై ప్రేమ ఉంటే స్పీకర్ పదవికి రాజీనామా చేసి రాజకీయాలు చేసుకోవాలని ఆయన హితవు పలికారు. స్పీకర్ పదవిలో ఉండి ఇలా మాట్లాడటం ఆ పదవికే మచ్చ తెస్తుందని అన్నారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరచమని కోరాల్సింది పోయి రాజకీయాలు మాట్లాడడం సరికాదన్నారు.
News September 6, 2025
ఉపాధ్యాయులు నిరంతరం నేర్చుకోవాలి: కలెక్టర్

ఉపాధ్యాయులు నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కొత్తపల్లిలో తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారిని భావి పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు.