News September 21, 2025

కొత్తగూడెం: సింగరేణి అధికారుల బదిలీ

image

సింగరేణి సంస్థలో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. సింగరేణి మైనింగ్ విభాగంలో పనిచేస్తున్న 31 మంది అధికారులను బదిలీ చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఎస్టాబ్లిష్మెంట్ సెల్ అధికారులు ఆర్డర్స్ ఇచ్చారు. బదిలీ అయిన వారిలో ఏజీఎం మొదలుకొని మేనేజర్ స్థాయి వరకు అధికారులు ఉన్నారు. కాగా ఈనెల 27వ తేదీలోగా కేటాయించిన స్థానాల్లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Similar News

News September 21, 2025

అటవీశాఖ నిర్లక్ష్యం.. మూగజీవాల మనుగడకు ప్రమాదం

image

అటవీశాఖ నిర్లక్ష్యం కారణంగా కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో మూగజీవాల మనుగడకు ప్రమాదం వాటిల్లుతోంది. అభయారణ్యంలో దుప్పిలు, కణుజులు, అడవి గొర్రెలు, పందుల వేట ముమ్మరంగా సాగుతోంది. వన్యప్రాణుల కోసం వేటగాళ్లు ఉచ్చులు పన్నుతున్నారు. ఈ అడవి 30 వేల ఎకరాల్లో ఉంది.. అటవీ ప్రాంతంలోనే దుప్పి మాంసాన్ని వండుకుని, అక్కడే భుజించడం, మద్యం తాగి రావటం అన్నది పరిసర ప్రాంతాల వారికి సరదాగా మారిందని స్థానికులు అంటున్నారు.

News September 21, 2025

ASF: ‘కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ తల్లి గర్వం’

image

దేశ స్వాతంత్ర్య పోరాటం నుంచి తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమం వరకు క్రియాశీలక పాత్ర పోషించిన కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి నేడు.1952లో ASF నుంచి శాసనసభలో అడుగుపెట్టారు. 1957లో డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన మహనీయుడు. తెలంగాణ జెండాను ఎవరూ ఎత్తినా ముందుండి నడిపించిన పోరాట యోధుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన జన్మస్థలం ASF జిల్లా వాంకిడి మండలం.

News September 21, 2025

పాడి పశువుల్లో కురమ జ్వరంతో నష్టాలు

image

పశువులకు అనేక రకాల సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. వర్షాకాలంలో బలిష్టమైన ఆంబోతులు, ఎద్దులు, ఆవులకు కురమ జ్వరం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి పశువులో 3 రోజులు మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ.. ఈ సమయంలో పశువులు బాగా నీరసించిపోతాయి. పాల దిగుబడి దాదాపు 80% వరకు తగ్గిపోతుంది. కురమ జ్వరం లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వెటర్నరీ నిపుణులు రాంబాబు కొన్ని సూచనలు చేశారు. అవేంటో చూద్దాం.