News September 20, 2025
కొత్తగూడెం సింగరేణి ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్

కొత్తగూడెంలోని సింగరేణి సంస్థ ప్రధాన ఆసుపత్రిలో శుక్రవారం అరుదైన ఆపరేషన్ నిర్వహించారు. 65 ఏళ్ల ఓ మహిళ శరీరం నుంచి 8kgల కాంప్లెక్స్ ఒవేరియన్ ట్యూమర్ తొలగించారు. సింగరేణి ఆసుపత్రి ప్రత్యేక వైద్య బృందం కంబైన్డ్ స్పెషల్ ఎపిడ్యూరల్ అనస్తీషియా కింద నిర్వహించారు. వైద్య సిబ్బందిని చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ కుమార్ అభినందించారు.
Similar News
News September 20, 2025
ఐటీ కంపెనీలపై ఎఫెక్ట్ ఇలా..!

భారత ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, TCS, విప్రో, HCL లాంటి సంస్థలు USలో పని చేస్తూ భారతీయులను రిక్రూట్ చేసుకుంటాయి. H1B వీసా అప్లికేషన్ ఫీజు పెంపుతో వాటిపై తీవ్ర ప్రభావం పడనుంది. ఒక్కో ఉద్యోగిపై లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల కంపెనీల లాభాలు తగ్గిపోతాయి. ఫలితంగా ఆ సంస్థలు ఇండియా లేదా ఇతర దేశాలకు తరలివెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో భారతీయులు అమెరికా వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చు.
News September 20, 2025
HYD: ట్రేడింగ్ ఫ్రాడ్‌లో సంజీవ్ కుమార్ అరెస్ట్

ట్రేడింగ్ మోసానికి పాల్పడిన పంజాబ్‌కు చెందిన సంజీవ్ కుమార్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సంజీవ్ సోషల్ మీడియా ద్వారా 69 ఏళ్ల పూజారిని నమ్మించి నకిలీ ట్రేడింగ్ యాప్‌లో లాభాలు వస్తున్నట్లు చూపించి రూ. 1.23 కోట్లు మోసగించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి మొబైల్ ఫోన్లు, చెక్‌బుక్, కంపెనీ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. అతడిపై ఇప్పటికే 5 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
News September 20, 2025
రాయచోటిలో వర్ష బీభత్సం.. ముగ్గురి మృతి

రాయచోటిలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసి పలువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. వరదనీటిలో కొట్టుకుపోతున్న తల్లీ, బిడ్డ షేక్ మున్నీ(27), ఇలియాస్ (6)ను కాపాడబోయి మరో వ్యక్తి వంగల గణేశ్ (30) మృతి చెందాడు. రామాపురం వద్ద స్కూల్ ఆటోలో నుంచి దూకేసి మాధవరం ఆరవ వాండ్లపల్లికి చెందిన ఆరవ యామిని (8) డ్రైన్ కాలువలో కొట్టుకుపోయింది. బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.