News November 19, 2025

కొత్తగూడెం: సివిల్స్ అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం

image

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అర్హులైన అభ్యర్థులందరూ రూ.లక్ష ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం నాయక్ తెలిపారు. గతంలో మెయిన్స్‌కు ఎంపికై రూ.లక్ష ప్రోత్సాహకం పొందిన అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News April 13, 2026

ఏప్రిల్ 17న సింహాచలంలో ఆర్జిత సేవలు రద్దు: ఈవో

image

సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏప్రిల్ 17న గంధం అమావాస్యను పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు రానున్నారు. 16న సాయంత్రం నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి రాత్రి కొండదిగువన వరాహ పుష్కరిణి వద్ద, కొండపైన జాగరం చేసి అమావాస్య రోజు దర్శించుకోవడం ఆనవాయితిగా వస్తోంది. కావున ఏప్రిల్ 17న ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు ఈవో వెంకట్రావు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News April 13, 2026

స్కూళ్లను 11AM వరకే నిర్వహించాలని విజ్ఞప్తి

image

AP: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. చాలా చోట్ల 43-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉ.11 గంటల వరకే ఒంటి పూట బడులు నిర్వహించాలని మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ విద్యాశాఖకు విజ్ఞప్తి చేసింది. విద్యార్థులు ఎండలకు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు స్కూళ్లకు వేసవి సెలవులు ఉండనున్నాయి.

News April 13, 2026

HYD: GREAT..11ఏళ్లుగా FREE కోచింగ్

image

ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థులకు మల్కాజిగిరి ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ కొట్టే ఏడుకొండలు అండగా నిలుస్తున్నారు. 11 ఏళ్లుగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ అందిస్తూ సేవ చేస్తున్నారు. 2015లో 32 మందితో ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పటికి 10 లక్షల మందికి విస్తరించింది. తన జీతంలో సుమారు 40 శాతం ఖర్చు చేస్తూ 13 సబ్జెక్టులు బోధిస్తున్నారు.