News September 24, 2025
కొత్తగూడెం: 1258 మంది జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరణ

సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 1258 మంది బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరిస్తూ బుధవారం సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. సింగరేణి సంస్థలు బదిలీ వర్కర్లుగా చేరి భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేస్తూ 190/240 మాస్టర్లు పూర్తి చేసిన వారిని జనరల్ అసిస్టెంట్ కేటగిరీ-1గా క్రమబద్ధీకరించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసినట్లు సీఎండీ తెలిపారు.
Similar News
News September 24, 2025
శ్రీకాకుళం: ప్రయాణికులకు గమనిక

దసరా పండుగ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పరిధిలోని నాలుగు డిపోల నుంచి దూర ప్రాంతాలకు 480 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి అప్పలనారాయణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 29 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఈ బస్సులు నడుస్తాయని ఆయన చెప్పారు. ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా, సాధారణ ఛార్జీలు ఉంటాయన్నారు.
News September 24, 2025
తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు, లోకేశ్

శ్రీవారి బ్రహోత్సవాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ బుధవారం తిరుమల చేరుకున్నారు. తిరుమలలోని గాయత్రి అతిథిగృహానికి చేరుకున్న సీఎం దంపతులకు ఛైర్మన్ BR నాయుడు స్వాగతం పలికారు. మరికాసేపట్లో వారు బేడీ ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు.
News September 24, 2025
ఆఫర్‌లోనూ ధరలు తగ్గలేదని చర్చ!

ఈ కామర్స్ సైట్లు దసరా సందర్భంగా పలు ఆఫర్లు ప్రకటించగా, తొలిరోజు ఉన్న ధరలు ఇప్పుడు లేకపోవడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఓ యూజర్ iphone 15plus ఫోన్‌ను బుక్ చేసేందుకు ట్రై చేయగా 23% ఆఫ్‌తో రూ.68,999గా చూపించిందని పేర్కొన్నారు. గతనెలలో ఇదే ఫోన్ రూ.69,499 ఉందని, ఆఫర్ పేరుతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మీకూ ఇలా జరిగిందా?