News April 16, 2025
కొత్తగూడ: వడదెబ్బతో వృద్ధురాలి మృతి

కొత్తగూడెం మండలం వేలుబెల్లిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాసాని మల్లమ్మ (70) వడదెబ్బతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇటీవల అకాల వర్షాలకు, వాతావరణ మార్పుల వల్ల ఎండ వేడిమి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ప్రజలు ఎండలో బయటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
Similar News
News December 23, 2025
సిరిసిల్ల: ‘వారం రోజుల్లో కూలీ పెంచకుంటే సమ్మెకు దిగుతాం’

పాలిస్టర్ పవర్లూమ్ కార్మికులకు, ఆసాములకు, వార్పిన్, వైపని అనుబంధ రంగాల కార్మికులకు కూలీ ఒప్పందం గడువు ముగిసి 20 నెలలు అవుతున్నా కూలీ పెంచడం లేదంటూ మంగళవారం సిరిసిల్లలో సీఐటీయూ తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వారం రోజుల్లో పాలిస్టర్ వస్త్రాలకు సంబంధించిన కూలీ పెంచకపోతే సమ్మె చేస్తామని ఆయన హెచ్చరించారు.
News December 23, 2025
సిరిసిల్ల : చలాన్ల ద్వారా రూ.4.28 కోట్ల జరిమానా

మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన కేసులు, వాహనాలకు ఈ చలాన్ల ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు 4.28 కోట్ల రూపాయల జరిమానా వసూలు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ మహేష్ బి గితే వెల్లడించారు. 2025లో 12,151 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 1,91,756 ఈ చలాన్ల ద్వారా 4 కోట్ల 28 లక్షల 3 వేల 95 రూపాయల జరిమానా వసూలు చేసినట్లు ఆయన తెలిపారు.
News December 23, 2025
సిరిసిల్ల: 121 మందిపై రౌడీషీట్లు.. నలుగురిపై పీడి యాక్ట్ అమలు

జిల్లావ్యాప్తంగా 121 మందిపై రౌడీ షీట్ అమలులో ఉన్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి గితే వెల్లడించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నలుగురిపై పీడి యాక్ట్ అమలు చేశామని తెలిపారు. గత సంవత్సరం గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి 98 కేసులలో 268 మందిని అరెస్టు చేసి 41 కిలోల 307 గ్రాముల గంజాయి సీజ్ చేయగా, ఈ సంవత్సరం 49 కేసులలో 141 మందిని అరెస్టు చేసి 4 కిలోల 740 గ్రాముల గంజాయి సీజ్ చేసినట్లు తెలిపారు.


