News December 6, 2024
కొత్తపట్నం బీచ్ వద్ద చిన్న సైజు విమానం
కొత్తపట్నం తీరప్రాంతంలో చిన్న సైజులో ఉన్న గల ఓ విమానాన్ని మెరైన్ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో ఈ పరికరం పడింది. విషయం తెలుసుకున్న మెరైన్ సీఐ, ఎస్సైలు గస్తీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హెడ్ కానిస్టేబుల్ రాజు, రామిరెడ్డి, హోంగార్డు లక్ష్మణ్‌లు తీరానికి వెళ్లి మత్స్యకారుల నుంచి ఆ పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News December 26, 2024
బాపట్ల: రేపు ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్
బాపట్ల జిల్లాలో ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ సెల్ జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రత్యేక గ్రీవెన్స్‌ను జిల్లాలోని ఎస్టీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News December 26, 2024
REWIND: ‘ప్రకాశం జలప్రళయానికి 35 మంది బలి
సునామీ ఈ పేరు వింటేనే ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2004 డిసెంబర్ 26న ప్రకాశం జిల్లాలో సునామీ పంజా విసిరింది. ఈ ధాటికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 35 మంది మృతి చెందారు. కళ్లెదుటే కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న పరిస్థితులను ఇప్పుడు తలచుకుంటే.. ఆ భయం అలానే ఉందని జిల్లా వాసులు పేర్కొంటున్నారు.
News December 25, 2024
ఎందుకింత కక్ష…? చంద్రబాబు: ఎమ్మెల్యే తాటిపర్తి
ఎందుకింత కక్ష చంద్రబాబు అంటూ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ‘కేవలం వైఎస్ జగన్ హయాంలో నియమితులైనవారని సచివాలయ వ్యవస్థపైన కక్ష గట్టి వారి జీతానికి బయోమెట్రిక్ అటెండెన్స్ లింక్ చేశారు. నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ రంగంలోని అన్ని శాఖల్లో ఈ నిర్ణయాన్ని అమలు చేయగలరా?, ఈ వయసులో కడుపు మంట ఎందుకు?’ అంటూ Xలో పోస్ట్ చేశారు.