News March 15, 2025

కొత్తపల్లి: పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

కొత్తపల్లి మండలంలోని నిడ్జింత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అల్పాహారం సరైన సమయానికి అందుతుందా లేదా అని ఆరా తీశారు. అల్పాహారం నాణ్యత లేకుంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. తద్వారా మధ్యాహ్న భోజనం అందించాలని చెప్పారు.

Similar News

News March 15, 2025

మెదక్: ఒక్కరోజు రాష్ట్ర స్థాయి వర్క్ షాప్

image

మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 22న వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో హెర్బేరియం తయారీ, నిలువ చేయు విధానం అనే అంశంపై ఒక్కరోజు రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. హుస్సేన్ తెలిపారు. రాష్ట్రీయ ఉచిత ఉచితార్ శిక్షాభియన్ వారి ఆర్థిక సహకారంతో ఈ కార్యశాలకు సంబంధించిన ప్రచార పత్రాన్ని కళాశాలలో ఆవిష్కరణ చేశారు. 

News March 15, 2025

ఇవాళ అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత

image

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. ఇవాళ తెలంగాణలో అత్యధికంగా కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 39.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. అటు ఏపీలో అత్యధికంగా నంద్యాల జిల్లా గోస్పాడు, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 5 రోజుల పాటు వడగాలులు కొనసాగుతాయని వాతావరణశాఖ తెలిపింది.

News March 15, 2025

జనం ఛీ కొట్టినా.. జగన్ మారట్లేదు: మంత్రి లోకేశ్

image

AP: వైసీపీ రాక్ష‌స మూక‌ల దాడిలో మృతిచెందిన‌ చిత్తూరు(D) కృష్ణాపురానికి చెందిన TDP కార్యకర్త రామకృష్ణకు క‌న్నీటి నివాళులు అర్పిస్తున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ దాడిలో గాయ‌ప‌డిన రామ‌కృష్ణ కుమారుడు సురేశ్‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వివరించారు. జనం ఛీ కొట్టినా మాజీ CM జగన్ హ‌త్యా రాజ‌కీయాలు మాన‌డం లేదని మండిపడ్డారు. YCP ర‌క్త‌చ‌రిత్ర‌కు TDP సైనికుడిని కోల్పోవ‌డం చాలా బాధాకరమన్నారు.

error: Content is protected !!