News March 8, 2025
కొత్తపల్లి: పేకాట శిబిరంపై పోలీసుల దాడి

కొత్తపల్లి మండల కేంద్రం శివారులో శుక్రవారం పేకాట శిబిరంపై దాడి చేసినట్లు ఎస్ఐ విజయ్ తెలిపారు. బెట్టింగ్ కాస్తూ కొంతమంది పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయమైన సమాచారం మేరకు దాడులు చేసి రూ. 45 వేల నగదు, ఐదు సెల్ ఫోన్లు, నాలుగు ద్విచక్రవాహనాలు సీజ్ చేసినట్లు చెప్పారు. పేకాట ఆడుతున్న ఏడుగురిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ చెప్పారు.
Similar News
News November 9, 2025
గన్నేరువరం మానసా దేవి ఆలయానికి భక్తుల రద్దీ

కార్తీక మాసం ఆదివారం సెలవు దినం కావడంతో గన్నేరువరంలోని ప్రసిద్ధ స్వయంభు మానసాదేవి ఆలయానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. 108 శివలింగాలు, జంట నాగులకు జలాభిషేకాలు నిర్వహించి, దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించారు. ఆలయ కమిటీ భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించింది. భక్తులు ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వాహనాలను ఉచిత పార్కింగ్ స్థలంలోనే నిలపాలని కమిటీచైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి సూచించారు.
News November 9, 2025
వెయ్యి మందికి రూ.9 కోట్ల సాయం: మంత్రి స్వామి

టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి స్వామి CMRF చెక్కులు పంపిణీ చేశారు. మర్రిపూడి మండలం పలువురికి మంజూరైన చెక్కులను ఆదివారం ఆయన అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యం పట్ల సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కొండపి నియోజకవర్గంలో దాదాపు వేయ్యి మందికి రూ.9కోట్ల వరకు సాయం చేశామని వెల్లడించారు.
News November 9, 2025
జూబ్లీ బైపోల్: వీరికి టెన్షన్.. వారికి ప్రశాంతం

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక సందర్భంగా కొద్ది రోజులుగా ప్రచారం జోరుగా సాగింది. మైకుల హోరుతో వీధులు, బస్తీలు దద్దరిల్లాయి. ఇక ఈ రోజు సాయంత్రం నుంచి ప్రచారం ముగియనుండటంతో ఈ గోల ఉండదు. దీంతో నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా.. రణగొణ ధ్వనులు లేకుండా ఉంటారు. అయితే పోటీచేసే అభ్యర్థులు, పార్టీల నాయకులు మాత్రం టెన్షన్‌తో ఉంటారు. ఎవరు.. ఎవరికి ఓటేస్తారో అర్థంకాక తలలు పట్టుకుంటారు.


