News April 10, 2025
కొత్తపల్లి: బెట్టింగ్‌లో నష్టం రావడంతో యువకుడి ఆత్మహత్యాయత్నం

బెట్టింగ్ యాప్‌లో నష్టం రావడంతో యూ.కొత్తపల్లి(M) రామన్నపాలెంలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన సూరిబాబు ఓ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలని గేమ్ ఆడి రూ.కోటి 50లక్షలు పోగొట్టుకున్నాడు. అప్పులవడంతో మంగళవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేయగా కుటుంబీకులు కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
Similar News
News April 18, 2025
చింతపల్లి: ఈనెల 22 వరకు జిల్లాలో మోస్తరు వర్షాలు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో రాగల ఐదు రోజుల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. రాగల ఐదు రోజుల వాతావరణ సమాచారాన్ని శాస్త్రవేత్తలు గురువారం ప్రకటించారు. ఈనెల 22వ తేదీ వరకు రంపచోడవరం, చింతపల్లి, పాడేరు, అరకు డివిజన్ల పరిధిలో కనిష్ఠంగా 3.1 మిల్లీమీటర్ల నుంచి గరిష్ఠంగా 8.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవుతుందన్నారు.
News April 18, 2025
వనపర్తి: బైక్ అదుపు తప్పి ఒకరికి గాయాలు

వనపర్తి మండలం అంజనగిరి శివారులో రోడ్డుప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పడంతో చందాపూర్‌కి చెందిన బాలయ్యకు గాయాలయ్యాయి. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన బాలయ్య పాన్‌గల్ మండలం కొత్తపేటలో డెయిరీ ఫామ్ నడుపుతూ జీవిస్తున్నాడు. గురువారం వనపర్తి వెళ్తున్న క్రమంలో బైక్ అదుపు తప్పి కింద పడ్డాడు. ఈ ఘటనలో బాలయ్య తీవ్రంగా గాయపడ్డాడు. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.
News April 18, 2025
MEMU రైలు అనంతపురం వరకు..

అనంతపురం జిల్లా ప్రజలకు రైల్యే శాఖ తీపి కబురు చెప్పింది. పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరుకు నడుస్తున్న MEMU రైలును అనంతపురం వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఈ రైలు అనంతపురం-బెంగళూరు మధ్య పరుగులు పెట్టనుంది. KSR బెంగళూరులో ఉ.8.35 గంటలకు బయలు దేరి అనంతపురానికి మ.1.55 గంటలకు చేరుకుంటుంది. తిరిగి అనంతలో మ.2.10 గంటలకు బయలుదేరి రాత్రి 7.50 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.