News October 27, 2025
కొత్తపల్లి: మతిస్థిమితం లేకే తల్లిని చంపిన కుమారుడు: పోలీసులు

కొత్తపల్లి మండలం గోకుల్ నగర్‌లో తల్లి భీమమ్మను హత్య చేసిన కుమారుడు రామకృష్ణకు మతిస్థిమితం లేదని పోలీసులు తెలిపారు. కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేక అతను గ్రామంలో తిరుగుతున్నాడని సీఐ సైదులు, ఎస్ఐ విజయ్ కుమార్ వెల్లడించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి బయట నిద్రిస్తున్న తల్లిని పార, బండరాయితో మోది చంపినట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 27, 2025
ధర్మపురి: మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అరెస్ట్..!

సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్‌ను స్వీకరించిన మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న ఆయణ్ను అరెస్ట్ చేసిన పోలీసులు సైఫాబాద్ పోలిస్ స్టేషన్‌కు తరలించారు.
News October 27, 2025
‘డిజిటల్ అరెస్టుల’పై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు

దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. వీటిపై నమోదైన FIRలను సమర్పించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుల విచారణ బాధ్యతను CBIకి అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకోసం సైబర్ క్రైమ్ నిపుణులు, వసతులు కావాలంటే చెప్పాలని CBIకి సూచించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
News October 27, 2025
ప్రజలందరూ ఇంటికే పరిమితం అవ్వండి: SP

ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. బలమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అనవసర ప్రయాణాలు పూర్తిగా మానుకోవాలని తెలిపారు. వాగులు, వంకలు, చెరువులు, కుంటలలో స్నానాలకు దిగవద్దని హెచ్చరించారు. ఇల్లు శిథిలావస్థలో ఉంటే బంధువుల ఇళ్లకు వెళ్లాలని సూచించారు.


