News April 24, 2024
కొత్తపల్లి: సీఎం పర్యటనకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు: డిఐజి
సీఎం రేవంత్ రెడ్డి రేపటి పర్యటనకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని డీఐజీ ఎల్ఎస్ చౌహన్ అన్నారు. మంగళవారం సీఎం పర్యటించనున్న తిమ్మారెడ్డిపల్లిలోని గురులోకామసంద్ దేవాలయం, మద్దూర్ మండల కేంద్రంలో కార్యకర్తలతో సమావేశమయ్యే ఫంక్షన్ హాల్‌ను పరిశీలించారు. ఆలయంలో పూజలు నిర్వహించి బందోబస్తుకు వచ్చిన పోలీసులతో సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎస్పీ యోగేష్ పాల్గొన్నారు.
Similar News
News December 25, 2024
ఉప రాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికిన మంత్రి జూపల్లి
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దంపతులు మెదక్ జిల్లా పర్యటనకు వెళ్తున్న సందర్భంగా ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దంపతులకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పూల బోకే అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.
News December 25, 2024
MBNR: BJP కొత్త సారథులు ఎవరు?
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో BJPని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. JANలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ BJPని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. మరి MBNR, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి.
News December 25, 2024
MBNR: మెదలైన ఎన్నికల సందడి.. యువత ఓటు ఎటు?
ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎలక్షన్లలో యువత ఓటును ఆకర్షించడానికి నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ సారి యువత ఓటు అధిక సంఖ్యలో నమోదు కావడంతో స్థానిక నాయకులలో భయం మొదలైంది. యువత మాత్రం అభివృద్ధి వైపే ఓటు వేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓటర్లను ప్రలోభ పెట్టేలా నాయకులు ప్రవర్తిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.