News April 8, 2025

కొత్తపల్లి: హత్య కేసులో నేరస్థుడికి జైలు శిక్ష

image

హత్యకేసులో నిందితుడికి యావజ్జీవజైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పుఇచ్చిందని ఎస్పీ యోగేశ్‌గౌతమ్ తెలిపారు. ఆయన వివరాలు.. వింజమూరుకు చెందిన జోగువెంకట్ రాములు కొత్తపల్లి మం. తిమ్మారెడ్డిపల్లికి చెందిన కృష్ణవేణిని అత్యాచారం విఫలయత్నంచేసి నిప్పంటించి హత్యచేశాడు. ఈకేసులో ముద్దాయికి సోమవారం జిల్లా జడ్జి అబ్దుల్ రఫీ శిక్ష విధించారు. 2022 ఫిబ్రవరి 15న బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామన్నారు.

Similar News

News January 11, 2026

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

image

చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ కోడి కిలో రూ.185 నుంచి రూ.190, మాంసం రూ.268 నుంచి 290 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.305 నుంచి రూ.315 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు 12 కోడిగుడ్ల ధర రూ. 84గా ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News January 11, 2026

మోసపోయిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్య

image

TG: CBI మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. స్టాక్ మార్కెట్‌లో అధిక లాభాల పేరుతో వాట్సాప్ ద్వారా వల వేసిన ముఠా ఆమె నుంచి రూ.2.58కోట్లు కొట్టేసింది. నకిలీ ట్రేడింగ్ టిప్స్, తప్పుడు స్క్రీన్ షాట్లతో నమ్మించి పెట్టుబడులు పెట్టించింది. లాభాలు కనిపించినా డబ్బు విత్‌డ్రా అవకాశం లేకపోవడంతో మోసం బయటపడింది. సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 11, 2026

కోళ్ల ఫారంలో ఈ తప్పు చేయొద్దు

image

కోళ్ల ఫారంలో చనిపోయిన కోళ్లను ఎప్పుడూ దాణా బస్తాలపై ఉంచకూడదు. ఇలా చేస్తే మరణించిన కోడిలో ఉండే బాక్టీరియా, వైరస్‌లు దాని శరీరం నుంచి దాణాలోకి చేరతాయి. ఈ దాణాను మనం షెడ్డు మొత్తం కోళ్లకు వేస్తాము. దీంతో ఆ బాక్టీరియా షెడ్డులో కోళ్లకు వ్యాపించి అవి కూడా మరణిస్తాయి. అందుకే వ్యాధితో ఏదైనా కోడి మరణిస్తే షెడ్డు నుంచి దూరంగా వాటిని పూడ్చిపెట్టాలి. ఈ విషయంలో పెంపకందారులు జాగ్రత్త వహించాలి.