News September 21, 2025
కొత్తమ్మ తల్లి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశాం: కలెక్టర్

కోటబొమ్మాళిలో వెలసి ఉన్న శ్రీ కొత్తమ్మ తల్లి ఉత్సవాల జాతరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. శనివారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని అధికారులకు సూచించారు. భద్రతా దృష్ట్యా సీసీ కెమెరాలు, డ్రోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. అధికారులు పాల్గొన్నారు.
Similar News
News September 20, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

✒︎ కొత్తమ్మతల్లి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశాం: కలెక్టర్
✒︎ శ్రీకాకుళం: దొంగల నుంచి రూ.58 లక్షలు స్వాధీనం
✒︎ పర్యావరణంపై ప్రతీఒక్కరు దృష్టి సారించాలి: ఎమ్మెల్యే బగ్గు
✒︎ ఇచ్ఛాపురం: కేసుపురంలో ఆకస్మాతుగా కూలిన ఇంటి గోడ
✒︎ పొందూరు: భవనంపై నుండి జారిపడిన విద్యార్థిని
✒︎ అధ్వానంగా కింతలి-శ్రీకాకుళం రహదారి
✒︎ నరసన్నపేట: నదిలో హెచ్ఎం గల్లంతు.. మృతదేహం లభ్యం
News September 20, 2025
పలాస: ఈ చిన్నారి వివరాలు తెలిస్తే సమాచారమివ్వండి

పలాస రైల్వే స్టేషన్‌లో సంరక్షకులు లేకుండా ఒంటరిగా తిరుగుతున్న ఓ చిన్నారి కనిపించింది. ప్రయాణికులు 139 నంబర్‌కు సమాచారం ఇవ్వగా, జీఆర్పీ సిబ్బంది అబ్బాయిని శిశుగృహనికి తరలించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ నుంచి ఒంటరిగా దిగిన బాలుడికి మూడేళ్లు ఉంటాయని వివరాలు తెలిసిన వారు శ్రీకాకుళంలోని ఉమన్ ఛైల్డ్ డిపార్ట్ మెంట్‌కు తెలపాలని జీఆర్పీ ఎస్సై శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
News September 20, 2025
పొందూరు: భవనంపై నుంచి జారిపడిన విద్యార్థిని

పాఠశాల భవనంపై నుంచి జారిపడి ఓ విద్యార్థిని తీవ్రగాయాలపాలైంది. ఈ ఘటన పొందూరు(M) లోలుగులోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మూడంతస్తుల భవనంపైకి వెళ్లి ప్రమాదవశాత్తూ జారిపడింది. తీవ్రగాయాలవ్వడంతో ఆమెను నైట్ డ్యూటీ సిబ్బంది హుటాహుటిన రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.