News August 18, 2024

కొత్తవలసలో ఆ రైలుకు హాల్ట్

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సబల్‌పూర్-ఈరోడ్ రైలును ఈనెల 21, నుంచి నవంబర్ 27 వరకు ప్రతి బుధవారం నడపనున్నారు. తిరుగు ప్రయాణంలో ఈరోడ్ నుంచి ప్రతి శుక్రవారం ఈ రైలు బయలుదేరుతుందని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. ఈ రైలు కొత్తవలస స్టేషన్‌లో ఆగుతుందని చెప్పారు.

Similar News

News February 28, 2026

వచ్చే మూడేళ్లలో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాజెక్టులు పూర్తి: సీఎం

image

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని పెండింగ్‌లో ఉన్న తాగునీటి ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రావివలస ప్రజా వేదికలో ఆయన మాట్లాడారు. పోలవరం నుంచి సుజల స్రవంతి ద్వారా విశాఖకి త్వరలోనే నీరు అందిస్తామన్నారు. వంశధార, నాగావళి, చంపావతి నదులను గోదావరితో అనుసంధానం చేస్తామన్నారు.

News February 28, 2026

విజయనగరం జిల్లాను ఉద్యాన వనంగా తీర్చి దిద్దుతాం: సీఎం

image

విజయనగరం జిల్లాలో వచ్చే రెండేళ్లలో పండ్ల తోటల పెంపకానికి తగిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మరో రెండేళ్లలో ఇది కార్యరూపం దాలుస్తుందన్నారు. ప్రస్తుతం సాగు చేస్తున్న మొక్కజొన్న వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్నారు. ఇకపై భవిష్యత్తులో పండ్లతోటలకు ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు సూచించారు. దీనికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందన్నారు.

News February 27, 2026

VZM: జిల్లాలో 2.69 లక్షల మందికి రూ.114.83 కోట్ల పంపిణీ

image

జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద శనివారం 2,69,748 మందికి రూ.114.83 కోట్లు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని రావివలస గ్రామ సచివాలయ పరిధిలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో 36,903 మందికి రూ.15.80 కోట్లు, చీపురుపల్లి మండలంలో 8,431 మందికి రూ.3.56 కోట్లు, రావివలస గ్రామంలో 387 మందికి రూ.16 లక్షలు అందజేయనున్నారు.