News July 6, 2024
కొత్తూరు: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

ఉరి వేసుకుని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం కొత్తూరు పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఉమా శంకర్, ప్రియాంక దంపతులు జీవనోపాధి కోసం పట్టణానికి వచ్చి సాయికృష్ణ ఫంక్షన్ హాల్ సమీపంలో అద్దెకు ఉంటున్నారు. భర్త పరిశ్రమలో విధులకు వెళ్ళగా ఎవరు లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని అన్నారు.
Similar News
News July 5, 2025
MBNR: BJP కొత్త సారథి.. అభినందించిన డీకే అరుణ

హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్.రాంచందర్ రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో పాలమూరు ఎంపీ, జాతీయ కౌన్సిల్ మెంబెర్ డీకే అరుణ నూతన ఆయన్ను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి జిల్లా బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News July 5, 2025
MBNR: ‘58 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యం’

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వనమహోత్సవానికి అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జిల్లాలో మొత్తంగా 58 లక్షల మొక్కలను నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ముందస్తు చర్యలలో భాగంగా అటవీ, ఉపాధి హామీ, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో 66.12 లక్షల మొక్కలను ఈపాటికే పెంచారు. ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గుంతలు తీసే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. రహదారుల వెంట 27,26,668 మొక్కలను నాటనున్నారు.
News July 5, 2025
జడ్చర్ల: అనుమానదాస్పదంగా మెకానికల్ ఇంజినీర్ మృతి

ఓ మెకానికల్ ఇంజినీర్ అనుమానస్పదంగా మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఎస్ఐ విక్రమ్ తెలిపిన వివరాలు.. నవాబ్‌పేట(M) కాకర్ణాల సమీపంలోని ఓ మినరల్స్ కంపెనీలో కృష్ణా జిల్లా మంటాడకి చెందిన కాశి పూర్ణచందర్రావు(43) పనిచేస్తున్నారు. ఈనెల 2న విధులు ముగించుకుని గదికి వచ్చిన ఆయన గురువారం శవమై కనిపించాడు. తోటి ఉద్యోగులు పోలీసులకు సమాచారమందించారు. మృతుడి భార్య దీప్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.