News February 12, 2025

కొత్తూరు: దర్గాను దర్శించుకున్న హీరో విశ్వక్ సేన్

image

షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని జేపీ దర్గాను ప్రముఖ సినీ హీరో విశ్వక్‌సేన్ దర్శించుకున్నారు. త్వరలో విడుదల కానున్న తన సినిమా లైలా హిట్ కావాలని కుటుంబసభ్యులతో కలిసి దర్గాలో ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి దర్గాకు వస్తుండే వాడినని, ఈ మధ్యకాలంలో రాలేకపోయానన్నారు.

Similar News

News February 12, 2025

శామీర్‌పేట్‌లో యాక్సిడెంట్.. యువతి మృతి (UPDATE)

image

శామీర్‌పేట్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యి చికిత్స పొందుతున్న యువతి భవాని మంగళవారం అర్ధరాత్రి మృతి చెందింది. సోమవారం రెడీ‌మిక్స్ వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలు కాగా వెంటనే కొంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు వైద్యచికిత్సల నిమిత్తం రూ.రెండున్నర లక్షలు వసూలు చేశారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

News February 12, 2025

HYD: ఈ నెల 17వరకు నుమాయిష్ పొడిగింపు

image

HYD నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్ జనవరి 3వ తేదీన ప్రారంభమైంది. నుమాయిష్‌ను సందర్శించేందుకు భారీగా సందర్శకులు తరలివస్తున్నారు. సందర్శకులు భారీగా తరలివస్తుండడంతో పోలీసులు భద్రత కారణాల దృష్ట్యా మొదటగా ఈనెల 15వ తేదీ వరకు అనుమతి ఇస్తామని HYD సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. అనంతరం ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యుల వినతి మేరకు ఈనెల 17 వరకు అనుమతి లభించినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు.

News February 12, 2025

హైదరాబాద్‌లో 99 తపాలా పోస్టులు

image

పోస్టల్ శాఖలో 31 GDS, 68 డాక్ సేవక్ పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్, బైక్ నడపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. #SHARE IT

error: Content is protected !!