News February 12, 2025
కొత్తూరు: దర్గాను దర్శించుకున్న హీరో విశ్వక్ సేన్

షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని జేపీ దర్గాను ప్రముఖ సినీ హీరో విశ్వక్‌సేన్ దర్శించుకున్నారు. త్వరలో విడుదల కానున్న తన సినిమా లైలా హిట్ కావాలని కుటుంబసభ్యులతో కలిసి దర్గాలో ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి దర్గాకు వస్తుండే వాడినని, ఈ మధ్యకాలంలో రాలేకపోయానన్నారు.
Similar News
News September 19, 2025
పార్టీ ఫిరాయింపులు.. ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

TG: పార్టీ ఫిరాయింపులపై ఆరుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు పంపారు. తాము పార్టీ మారలేదని ఎమ్మెల్యేలు చెప్పగా, దానిపై సంతృప్తి చెందని స్పీకర్ మరిన్ని ఆధారాలు కావాలని కోరారు. త్వరలో ఎమ్మెల్యేల విచారణకు ట్రయల్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం. సంజయ్, పోచారం, యాదయ్య, వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డిలకు ఈ నోటీసులు ఇచ్చారు.
News September 19, 2025
అల్లూరి జిల్లాలో 3,200 పిల్లలకు పౌష్టికాహార లోపమా..?

అల్లూరి జిల్లాలో మొత్తం 3314 అంగన్వాడీ కేంద్రాల్లో 3,200 మంది బరువు తక్కువగా ఉన్న పిల్లలు ఉన్నారని ICDS. PD. జాన్సీ రామ్ అన్నారు. రాజవొమ్మంగి, అడ్డతీగల మండలాల్లోని ICDS కార్యక్రమాల్లో ఆమె గురువారం పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు. పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్నా వీరందరి ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ ప్రత్యేకమైన ఆహరం అందిస్తున్నామని తెలిపారు.
News September 19, 2025
HYD: ‘అయ్యా..! మా కడుపుమీద కొట్టకండి

HYD, రంగారెడ్డి జిల్లాలోని పేదల రేషన్‌కార్డులు కట్ చేశారని మండిపడుతున్నారు. సమాచారం ఇవ్వకుండా తమ కడుపుమీద కొట్టారని వాపోతున్నారు. డీలర్ల వద్ద సమాచారం లేదని, అధికారులను అడగాలంటున్నారని వాపోయారు. వ్యవస్థ మీద అవగాహనలేనివారి పరిస్థితి ఏంటని ప్రశిస్తున్నారు. కొందరు మండలాఫీసులో సంప్రదిస్తే అధికారులకే కారణం తెలియడంలేదని వాపోతున్నారు. తమ కార్డలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. మీ కార్డూ రద్దైందా?