News April 16, 2025
కొత్త ఆర్ఓఆర్ చట్టాలపై అవగాహన కల్పించాలి: VKB కలెక్టర్

భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ రెవెన్యూ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో కొత్త ఆర్ఓఆర్ చట్టంపై తహశీల్దార్‌లతో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లింగ్యా నాయక్, ఆర్డీఓ వాసు చంద్రతో కలిసి సమీక్ష నిర్వహించారు.
Similar News
News January 2, 2026
ఒంగోలు: రూ.5.69 కోట్ల మద్యం తాగేశారు..!

ప్రకాశం జిల్లాలో డిసెంబర్‌కు సంబంధించి రూ. 110 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. డిసెంబర్ 31వ తేదీ రూ.5.69 కోట్ల మద్యాన్ని షాపులకు తరలించారు. ఈ మేరకు భారీగా విక్రయాలు జరిగాయి. డిసెంబర్‌లో మొత్తం 5,2280 కేసుల బీర్లు విక్రయించారు. 2024 డిసెంబర్ కంటే 2025లో రూ.6కోట్ల వ్యాపారం అధికంగా జరిగినట్లు సమాచారం.
News January 2, 2026
ఒత్తిడిని ఇలా తగ్గించేద్దాం..

అధిక ఒత్తిడినించి బైట పడాలంటే చిన్న చిన్న పనులు చేయాలని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఆలోచనలు నెమ్మదిస్తాయి. డీప్ బ్రీతింగ్స్ తీసుకోవాలి. ముక్కు ద్వారా గాలిని పీల్చుకుని నోటి ద్వారా వదలాలి. చాలామంది ఒత్తిడికి గురైనప్పుడు ఆలోచించడం ఆపేయాలని అనుకుంటారు. కానీ దీని వల్ల ఆందోళన పెరుగుతుంది. కాబట్టి కొన్ని విషయాలు యాక్సెప్ట్ చేయడం అలవాటు చేసుకుంటేనే శరీరం, మనస్సు రిలాక్స్ అవ్వడం ప్రారంభిస్తాయి.
News January 2, 2026
కృష్ణా: విషాదం.. చెరువులో 60 రోజుల చిన్నారి మృతదేహం లభ్యం

మోపిదేవి మండలం వెంకటాపురంలో 2 నెలల పసికందు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. 60 రోజుల వయసున్న చిన్నారి మృతదేహం గ్రామ సమీపంలోని చెరువులో లభ్యమైంది. సమాచారం అందుకున్న చల్లపల్లి సీఐ ఈశ్వర్‌రావు, ఎస్ఐ గౌతమ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. చిన్నారి మృతికి గల కారణాలపై పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


