News February 18, 2026

కొత్త ఓటర్ లిస్టు మ్యాపింగ్ త్వరలో పూర్తి చేస్తాం: నిజామాబాద్ కలెక్టర్

image

2002 ఓటర్ లిస్టు ప్రకారం కొత్త ఓటర్ లిస్టు మ్యాపింగ్ త్వరలో పూర్తి చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ, ఇతర అంశాలపై CEO సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో కొంత జాప్యం జరిగిందని, ప్రస్తుతం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తామని తెలిపారు.

Similar News

News February 20, 2026

NZB: నేడు బాధ్యతలు స్వీకరించనున్న మేయర్

image

నిజామాబాద్ నగర మేయర్‌గా ఇటీవల ఎన్నికైన కూరగాయల ఉమారాణి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించనున్న కార్యక్రమానికి కార్పొరేటర్లు విచ్చేయాలని కమిషనర్ కోరారు.

News February 19, 2026

పిల్లలకు ఫోన్ ఇచ్చే ముందు ఇవి పాటించాల్సిందే: సీపీ

image

పిల్లల చేతికి ఫోన్ ఇచ్చే ముందు తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు పాటించాలని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. చిన్నారులు ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్‌లో ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉంచాలని హెచ్చరించారు. లేకపోతే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడే ప్రమాదాలు ఉన్నాయన్నారు. పిల్లలకు UPI పిన్, క్రెడిట్ కార్డు వివరాలు చెప్పకూడదని అన్నారు. ఫోన్లో ‘చైల్డ్ సెట్టింగ్ టూల్స్’ వాడాలని చెప్పారు.

News February 19, 2026

ఎడపల్లిలో వివాహిత సూసైడ్

image

ఎడపల్లి మండల కేంద్రంలో వివాహవిత ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. అదనపు కట్నం వేధింపులతోనే వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తెలిపారు. వర్ని మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన వీర్ల శైలజకుఎడపల్లికి చెందిన వీర్ల సతీష్‌తో వివాహం జరిగింది. దుబాయ్ వెళ్లేందుకు రూ.లక్ష తీసుకురావాలని శైలజను సతీష్ వేధించాడు. వేదింపులు భరించలేక గురువారం శైలజ ఉరి వేసుకుంది.