News December 14, 2025
కొత్త కానిస్టేబుళ్లకు 16న నియామక పత్రాలు

AP: 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16న మంగళగిరి APSP ఆరోబెటాలియన్‌లో CM CBN ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 22వ తేదీలోపు వారికి కేటాయించిన విభాగాల్లో రిపోర్టు చేయాలి. అక్కడ 9 నెలలపాటు కానిస్టేబుళ్లకు శిక్షణ ఉంటుంది. 2022 NOVలో నోటిఫికేషన్ రాగా అనేక అడ్డంకులను దాటుకుని ఈ ఏడాది AUGలో తుది ఫలితాలు <<18212645>>వెల్లడైన<<>> విషయం తెలిసిందే.
Similar News
News December 15, 2025
పొట్టి శ్రీరాములుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: CM CBN

AP: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనకు ఘన నివాళి అర్పించారు. ‘గాంధీ బాటలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్న ధీరోదాత్తుడు శ్రీరాములు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలని ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడి సాధించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు తన ప్రాణత్యాగంతో నాంది పలికిన ఆ మహనీయునికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
News December 15, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గోల్డ్ రేట్స్ ఇవాళ కూడా భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.820 పెరిగి రూ.1,34,730కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.750 ఎగబాకి రూ.1,23,500 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.3,000 పెరిగి రూ.2,13,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 15, 2025
అంచనాలను అందుకోని రబీ సాగు

AP: గత కొన్ని నెలలుగా వర్షాభావం, అధిక వర్షాల ప్రభావం ప్రస్తుత రబీ సీజన్‌పై ప్రభావం చూపింది. 2 నెలలు గడుస్తున్నా రబీ సాగు అంచనాలను అందుకోలేదు. ఈ సీజన్‌లో 20.70 లక్షల హెక్టార్లలో 22 రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా, 6.57 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటల సాగు జరుగుతోంది. వరి 1.33 లక్షలు, చిరుధాన్యాలు 1.21 లక్షలు, నూనెగింజలు 0.21 లక్షలు, అపరాలు 3.44 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగవుతున్నాయి.


