News February 3, 2026

కొత్త చట్టంలోనూ ఆ బెనిఫిట్స్ ఉంటాయి: కేంద్రం

image

కొత్త ఐటీ చట్టంలో ప్రీకన్‌స్ట్రక్షన్ ఇంట్రెస్ట్‌పై పన్ను మినహాయింపు ఉండదన్న వార్తలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కొత్త చట్టంలోనూ హోమ్‌లోన్స్‌కు ఈ మినహాయింపు కొనసాగుతుందని తెలిపింది. ప్రాపర్టీ నిర్మాణంలో ఉండగా చెల్లించిన ఇంట్రెస్ట్‌పై పన్ను మినహాయింపును ఆ ప్రాపర్టీ పూర్తైన తర్వాత పొందొచ్చు. ప్రాపర్టీ చేతికి అందినప్పటి నుంచి ఐదు ఇన్‌స్టాల్మెంట్లలో ఏటా దాదాపు ₹2లక్షల వరకు ట్యాక్స్ డిడక్షన్ పొందొచ్చు.

Similar News

News February 21, 2026

కందులను నిల్వ చేసేటప్పుడు జాగ్రత్తలు

image

కంది గింజలను గోనె సంచులలో లేదా ట్రిపుల్ లేయర్ బ్యాగులలో గాని నిల్వ చేయాలి. బస్తాలు నిల్వ చేసే గది గోడలపైన, నేలపై లీటరు నీటికి మలాథియాన్ 50% ఇ.సి 20ML కలిపి పిచికారీ చేయాలి. కంది గింజలు నింపిన బస్తాలను చెక్క బల్లలపై వరుసలలో పేర్చి తేమ తగలకుండా జాగ్రత్త వహించాలి. గృహ అవసరాల కోసం నిల్వ చేస్తే బాగా ఎండనిచ్చి ఆ తర్వాత ఏదైనా వంటనూనె 50mlను కిలో గింజలకు పట్టించి నిల్వచేసి పురుగు ఉద్ధృతిని తగ్గించవచ్చు.

News February 21, 2026

నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌లో ఉద్యోగాలు

image

నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌(<>NDC<<>>) 14 స్పెషలిస్ట్ గ్రేడ్ 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మార్చి 6వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, పీజీ(డిప్లొమా) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.1,23,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ncdc.mohfw.gov.in

News February 21, 2026

ఆయేషా మీరా కేసు.. అసలు దోషులెవరు?

image

AP: 18ఏళ్ల కిందట సంచలనం రేపిన బీఫార్మసీ స్టూడెంట్ ఆయేషా మీరా హత్యాచారం <<19196372>>కేసును<<>> CBI కోర్టు క్లోజ్ చేసింది. 2007లో హాస్టల్‌లో ఆమెను రేప్ చేసి చంపారనేది ప్రధాన ఆరోపణ. 2009లో సత్యంబాబును దోషిగా తేల్చి, 2017వరకు జైల్లో ఉంచి నిర్దోషిగా తేల్చారు. అసలైన దోషిని పట్టుకోవడం లేదని ఆయేషా పేరెంట్స్ HCకి వెళ్లారు. 2018లో కేసు CBI చేతికి వెళ్లగా ఇన్నేళ్ల విచారణలో ఆధారాలేమీ దొరకలేదని కోర్టు కేసు కొట్టివేసింది.