News January 12, 2026

కొత్త జిల్లాలు రద్దు చేస్తారా? TGలో ఇదే హాట్ టాపిక్

image

TG: జిల్లాల <<18778067>>పునర్వ్యవస్థీకరణ<<>> పేరిట కొత్త జిల్లాల రద్దుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని BRS ఆరోపిస్తోంది. రద్దు చేస్తే ఊరుకోబోమంటూ సిరిసిల్ల, సిద్దిపేట సహా పలు జిల్లాల్లో ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మరోవైపు HNK జిల్లాను WGLలో కలిపేస్తామని తాజాగా కాంగ్రెస్ MLA నాయిని రాజేందర్ పేర్కొన్నారు. దీంతో జిల్లాలను కుదిస్తారా లేదా సరిహద్దులను మాత్రమే మారుస్తారా అనేది చర్చనీయాంశమైంది.

Similar News

News February 11, 2026

151 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL)151 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిప్లొమా, ఇంటర్, టెన్త్, ITI అర్హత గలవారు నేటి నుంచి FEB 25 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, DV ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.21,000-23,000తో పాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. సైట్: https://hal-india.co.in

News February 11, 2026

అంకితభావంతో పనిచేస్తే రిజల్ట్ ఇలా ఉంటుంది!

image

ఇండోర్(MP) మున్సిపల్ కమిషనర్‌గా IAS అధికారి అశీష్ సింగ్ అద్భుతం చేశారు. 2018లో 6 నెలల్లో 13 లక్షల టన్నుల వ్యర్థాలను తొలగించి రూ.400కోట్ల విలువైన 100 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. అద్దె యంత్రాలు వాడటంతో ₹65 కోట్ల ఖర్చును ₹10 కోట్లకు తగ్గించారు. ఆయన చూపిన పాలనా దక్షతతోనే ఇండోర్ నేడు దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా వెలుగొందుతోంది. ఇలాంటి అంకితభావం కలిగిన అధికారులే దేశానికి అవసరం. ఏమంటారు?

News February 11, 2026

తేనెతో జుట్టుకు పోషణ

image

తేనె వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. అయితే తేనె సౌందర్య పరిరక్షణలో, జుట్టు సంరక్షణలోనూ కీలకపాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. * తేనె, ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేయడం వల్ల జుట్టు పట్టులా మెరుస్తుందని చెబుతున్నారు. *తలస్నానం చేసేముందు తేనె, పాలు కలిపి తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా తయారవుతుందని తెలిపారు.