News March 5, 2026
కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు: పవన్ కళ్యాణ్

AP: రాబోయే జడ్పీ ఎన్నికలను కొత్త జిల్లాల ప్రాతిపదికన నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని Dy CM పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో తెలిపారు. పంచాయతీల పునర్విభజనకూ న్యాయపరమైన అడ్డంకులు లేవని చెప్పారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసే, నాటే ప్రతి మొక్కకు జియో ట్యాగ్ వేసి సంరక్షించేలా వ్యవస్థను తీసుకువస్తామని తెలిపారు. బెంగళూరు నర్సరీల్లో అమలు చేస్తున్న అత్యాధునిక విధానాలను పరిశీలిస్తున్నామని వివరించారు.
Similar News
News March 6, 2026
క్యాన్సర్ చికిత్సలో సంచలనం.. 4 నెలల్లోనే చెక్!

క్యాన్సర్ చికిత్సలో ఒక అద్భుతం జరిగింది. కేవలం నాలుగు నెలల ‘ఇమ్యునోథెరపీ’తో 26ఏళ్ల యువతికి ఉన్న రెక్టల్ క్యాన్సర్ (మలనాళ క్యాన్సర్) పూర్తిగా నయమైంది. సాధారణంగా చేసే కీమోథెరపీ, రేడియేషన్ లేదా సర్జరీ వంటి బాధాకరమైన పద్ధతులు లేకుండానే ఈ విజయం దక్కడం విశేషం. ఈ చికిత్స శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి క్యాన్సర్ కణాలను అంతం చేస్తుంది. ఇది క్యాన్సర్ బాధితుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.
News March 6, 2026
యుద్ధంలో ఇరాన్‌కు రష్యా ఇంటెలిజెన్స్ సాయం!

యుద్ధంలో రష్యా ఇరాన్‌కు సాయం చేస్తోందని అమెరికా రక్షణ అధికారులు తెలిపినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. మిడిల్ ఈస్ట్‌లో మోహరించిన అమెరికన్ వార్‌షిప్‌లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, రాడార్ల సమాచారాన్ని ఇరాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు రష్యా చేరవేస్తోందని వెల్లడించింది. దీన్ని బట్టి రష్యా పరోక్షంగా ఈ యుద్ధంలో జోక్యం చేసుకుంటున్నట్టు అనిపిస్తోందని వివరించింది. చైనా ఇలాంటి చర్యలకు పాల్పడట్లేదని తెలిపింది.
News March 6, 2026
మళ్లీ తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ మార్కెట్లో <<19309772>>బంగారం<<>> ధరలు ఇవాళ రెండోసారి తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ మొత్తం రూ.1,750 దిగివచ్చింది. ప్రస్తుతం 10 గ్రా. బంగారం రూ.1,61,130గా ఉంది. అటు 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.1,600 తగ్గి రూ.1,47,700 పలుకుతోంది. కేజీ వెండి రేటు రూ.2.90 లక్షలుగా ఉంది.


