News December 22, 2025
కొత్త పథకాలపై ప్రభుత్వం కసరత్తు

TG: వచ్చే బడ్జెట్లో మరో 5 కొత్త పథకాలను ప్రకటించేలా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా విభాగాల నుంచి ప్రతిపాదనలను రప్పిస్తోంది. నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు, యువతను దృష్టిలో పెట్టుకొని వీటికి రూపకల్పన చేయిస్తోంది. ఈ పథకాలకు ఆర్థిక వనరుల లభ్యతపై ఆర్థిక శాఖ కసరత్తు చేపట్టింది. కాగా ఎన్నికల హామీ అయిన పెన్షన్ పెంపుపై ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News December 22, 2025
పెట్టుబడులు రావడం KCRకు ఇష్టం లేదేమో: మంత్రి శ్రీధర్

TG: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని KCR ఎందుకు చూడలేకపోతున్నారో అర్థం కావడం లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గ్లోబల్ సమ్మిట్ ఒప్పందాలపై KCR కామెంట్లను ఆయన ఖండించారు. ‘పెట్టుబడులు, ఉద్యోగాలు రావడం KCRకు ఇష్టం లేనట్టుంది. BRS హయాంలో జరిగిన చాలా ఒప్పందాలు కార్యరూపం దాల్చలేదు. అభివృద్ధికి దోహదపడేలా KCR సలహాలివ్వాలి. BRS నేతలు హైప్‌లో ఉన్నారు. మేం ప్రజలకు హోప్ ఇస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News December 22, 2025
మే 12 నుంచి EAPCET

AP: వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్స్ (CETs)-2026 షెడ్యూల్‌ను APSCHE విడుదల చేసింది. ఆయా సెట్ల పరీక్షల తేదీలు ఇలా ఉన్నాయి.
*EAPCET (Eng): 12, 13, 14, 15, 18
*EAPCET (agri, pharm): మే 19, 20
*ECET: ఏప్రిల్ 23
*ICET: ఏప్రిల్ 28
* LAW, EDCETs: మే 4
*PGECET: ఏప్రిల్ 29, 30, మే 2
*PGCET: మే 5, 8, 9, 10, 11
News December 22, 2025
GOOGLE MAP సాయంతో లూటీ… చివరకు ఏం జరిగిందంటే?

టెక్నాలజీ వాడుక ఇప్పుడు ఇళ్లలో లూటీలకూ పాకింది. గూగుల్ MAP స్ట్రీట్ వ్యూ ఫీచర్ సాయంతో ధనవంతుల ఇళ్లున్న ప్రాంతాలు, వాటిలోకి ఎలా చొరబడవచ్చో గుర్తించి ఓ ముఠా జంషెడ్‌పూర్‌లోని ఓ ఇంట్లో దొంగతనం చేసింది. అయితే పోలీసులు CCTV ఫుటేజీ, మొబైల్ ట్రాకింగ్‌ను కంబైనింగ్ చేసి పట్నాలో ఉన్న ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠా పక్కరాష్ట్రాలకు పారిపోయేలా రూట్‌నూ ఎంచుకొని మరీ తమ నుంచి తప్పించుకొనేదని పోలీసులు తెలిపారు.


