News December 20, 2025
కొత్త భవనాలకు ‘గ్రీన్ బిల్డింగ్ కోడ్’: విజయానంద్

AP: ఇంధన పరిరక్షణ, నెట్ కార్బన్ జీరో లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని CS విజయానంద్ పేర్కొన్నారు. ‘కొత్త భవనాలకు ప్లాన్ శాంక్షన్ కావాలంటే తప్పనిసరిగా ఎనర్జీ ఎఫీషియెంట్ ఎక్విప్‌మెంట్ వాడాలనే నిబంధన (Green Building Code)ను తీసుకువచ్చాం. ప్రతి గ్రామంలో సోలార్ రూఫ్ ఏర్పాటును ప్రోత్సహించేలా గ్రీన్ ఎనర్జీ పాలసీ పెట్టాం. ఇంధన పొదుపుపై అవగాహనకు స్కూళ్లలో ఎనర్జీ లిటరసీ క్లబ్స్ నెలకొల్పాం’ అని వివరించారు.
Similar News
News December 21, 2025
INDWvsSLW: నేడు వైజాగ్‌లో తొలి T20

ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్ గెలిచిన ఊపులో ఉన్న భారత్ ఇవాళ శ్రీలంకతో తలపడనుంది. 5 T20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ విశాఖ వేదికగా జరగనుంది. స్మృతి, హర్మన్, జెమీమా, దీప్తి, కమలిని, వైష్ణవి, రిచా ఘోష్, శ్రీచరణి వంటి ప్లేయర్లతో IND బలంగా ఉంది. అటు చమరి ఆటపట్టు నేతృత్వంలోని శ్రీలంక జట్టు కూడా సత్తా చాటాలనుకుంటోంది. 7PMకు మ్యాచ్ ఆరంభమవుతుంది. జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.
News December 21, 2025
కన్హా శాంతివనంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం

TG: కన్హా శాంతివనంలో హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ధ్యాన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు ప్రముఖులు ఒకే వేదికపై ధ్యానం చేశారు. ఇవాళ రాత్రి 8 గంటలకు కన్హా శాంతివనం వేదికగా లక్ష మందితో వర్చువల్ ధ్యానం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందుకోసం <
News December 21, 2025
YS జగన్‌కు పవన్, షర్మిల విషెస్

AP: మాజీ సీఎం, వైసీపీ అధినేత YS జగన్ పుట్టినరోజు సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. ‘మాజీ సీఎం జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’ అని Dy.CM పవన్ ట్వీట్ చేశారు. APCC చీఫ్ షర్మిల, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సైతం X వేదికగా విషెస్ చెప్పారు.


