News January 23, 2025
కొత్త రేషన్ కార్డుల కోసం 13,921 దరఖాస్తులు: కలెక్టర్
ప్రజాపాలన గ్రామసభల నిర్వహణలో భాగంగా బుధవారం జిల్లాలో 221 గ్రామ సభలు,47 మున్సిపల్ వార్డు సభలు మొత్తం 268 గ్రామ ,వార్డు సభలు నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు గడచిన రెండు రోజులు కలుపుకొని 444 గ్రామసభలు, 95 మున్సిపల్ వార్డుల సభలను నిర్వహించినట్లు ఆమె వెల్లడించారు. బుధవారం రేషన్ కార్డుల కోసం 13,921 కొత్త దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని తెలిపారు.
Similar News
News January 22, 2025
ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగపరచుకోవాలి
హుజూర్‌నగర్‌లోని టౌన్ హాల్‌లో బుధవారం పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మెగా ఉచిత గుండె, కిడ్నీ, ఎముకల వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎరగాని నాగన్న గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అయన సూచించారు.
News January 22, 2025
NLG: స్కాలర్ షిప్ దరఖాస్తులకు మరో ఛాన్స్
2024-25 విద్యా సంవత్సరానికి గాను ఉపకారవేతనాలు, ఫీజు రియంబర్స్‌మెంట్‌ల కొరకు ఈపాస్ అన్లైన్‌లో ఇంకనూ ధరఖాస్తు చేయని బీసీ, EBC విద్యార్ధులు మార్చి 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఖాజా నాజిమ్ అలీ అప్సర్ ఒక ప్రకటనలో కోరారు. ఈపాస్ వెబ్సైట్ ద్వారా తమ కళాశాల విద్యార్థుల వివరాలను ఆయా కళాశాలల ప్రిన్సిపల్‌లు నమోదు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
News January 22, 2025
మానవత్వం చాటుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే ‘వేముల’
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల మరోసారి మానవత్వం చాటుకున్నారు. నకిరేకల్ మండలం కడపర్తిలో బుధవారం జరిగిన ప్రజా పాలన గ్రామ సభకు హజరైన ఆయనకు ఓ మహిళ పెన్షన్ రావడంలేదని తెలిపింది. ఏడేళ్ల నుంచి నరాల వ్యాధితో బాధపడుతున్న తన భర్త సత్తయ్యకు పెన్షన్ రావడం లేదని గంగమ్మ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెల్లింది. పెన్షన్ మంజూరు అయ్యేంతవరకు తానే సొంత డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చి డబ్బులు అందించారు.