News January 9, 2025
కొత్త వైరస్.. ఒంగోలు GGHలో 20 బెడ్లు ఏర్పాటు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్ఎంపీ వైరస్ నివారణలో భాగంగా.. ఒంగోలులోని GGHలో 20 బెడ్లు ఏర్పాటు చేశామని, ఎక్స్‌పర్ట్ కమిటీతోపాటు పలు కమిటీలను నియమించామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జమున తెలిపారు. మగవారికి 10 బెడ్లు, మహిళలకు 10 బెడ్ల చొప్పున ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. డాక్టర్ కళ్యాణి HOD జనరల్ మెడిసిన్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని చెప్పుకొచ్చారు.
Similar News
News March 1, 2026
ఒంగోలు బస్టాండ్ అభివృద్ధి వైపు కలెక్టర్

ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు శనివారం ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌ను స్వయంగా తనిఖీ చేశారు. బస్టాండ్‌లో పార్కింగ్, పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో బస్టాండ్ అభివృద్ధిపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News February 28, 2026
AP కొత్త CSగా.. ప్రకాశం జిల్లా వాసి.!

AP చీఫ్ సెక్రెటరీగా <<19261711>>సాయిప్రసాద్<<>> నేడు బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మట్టిగుంట గ్రామానికి చెందిన ఆయన 1991 IAS బ్యాచ్‌కు చెందిన అధికారి. తన సర్వీసులో కీలక పోస్టులలో పని చేశారు. 2024 జూన్ నుంచి జలవనరుల శాఖ కార్యదర్శిగా.. 2025 జనవరి నుంచి CM ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. 2019-24 మధ్య ఏపీ సోలార్ కార్పొరేషన్ CMDగా కూడా పనిచేశారు.