News December 24, 2025
కొత్త సంవత్సరంలో ఇంట్లోకి ఇవి తెచ్చుకోండి

న్యూ ఇయర్‌లో అదృష్టం వరించాలంటే ఇంట్లోకి శ్రీయంత్రం, శాలిగ్రామం, స్వస్తిక్ గుర్తులను తీసుకురావాలని పండితులు, వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. వీటి వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని అంటున్నారు. ‘ఇంటి ఆవరణలో తులసి, మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, లక్కీ బ్యాంబూ మొక్కలు నాటండి. తులసి కోట వద్ద శాలిగ్రామాన్ని ఉంచి పూజిస్తే విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి’ అని చెబుతున్నారు.
Similar News
News February 15, 2026
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ముప్పు ఎవరికి ఎక్కువంటే?

* గతంలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్లలో మరోసారి కూడా వచ్చే అవకాశముంది. * భాగస్వామి నుంచి గనేరియా, క్లమీడియా వంటి లైంగిక సంబంధిత ఇన్ఫెక్షన్లు సోకిన మహిళల్లో ఈ ముప్పు కనిపించవచ్చు. * సంతాన సాఫల్యత కోసం చికిత్సలు తీసుకుంటున్నవారు. * ఫెలోపియన్ ట్యూబుల్లో లోపాలుండి, వాటిని సరిదిద్దేందుకు శస్త్రచికిత్స తీసుకున్నవారు. * పొగతాగే అలవాటు ఉన్న మహిళల్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి అవకాశాలు ఎక్కువ.
News February 15, 2026
పుల్వామా అమరుల పిల్లలకు అండగా ఉండటం మన బాధ్యత: సెహ్వాగ్

పుల్వామా <<19137017>>అమరవీరుల<<>> పిల్లలకు ఏడేళ్లుగా అండగా ఉన్నట్లు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు. తమ స్కూల్లో చదువుతున్న కొందరు పిల్లలు రాణించడం చూసి సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. ‘మన కలల్ని కాపాడేందుకు సైనికులు ప్రాణాలు అర్పించారు. వారి కలలను మనం కాపాడుకోవాలి. ఇది మన కృతజ్ఞత, బాధ్యత. ఈ పిల్లల పట్ల గర్వంగా ఉంది. వారి తండ్రులకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. జై హింద్’ అని పేర్కొన్నారు.
News February 15, 2026
ఏడాదిలో 250 గుడ్లు.. 6 నెలల్లో రెండున్నర kgల బరువు

గ్రామ ప్రియ కోళ్లు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. చూడటానికి ఆకర్షణీయంగా ఉండే గ్రామ ప్రియ కోళ్లు పెరటి పెంపకానికి ఎంతో అనువైనవి. వీటి గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. ఇవి ఆరు నెలల వయసు వచ్చేసరికే రెండున్నర కేజీల వరకు బరువు పెరుగుతాయి. ఏడాదిలో 250 గుడ్లను పెడతాయి. అధిక వ్యాధినిరోధక శక్తిని కలిగి ఉండటం వల్ల త్వరగా జబ్బుల బారిన పడవని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు.


