News January 1, 2026

కొత్త సంవత్సర వేడుకలపై ఉక్రెయిన్ దాడి.. 24 మంది మృతి

image

రష్యా నియంత్రణలోని ఖేర్సన్‌లో నూతన సంవత్సర వేడుకలపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఖోర్లీలోని ఒక హోటల్, కేఫ్ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో 24 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి ఉన్నట్లు గవర్నర్ వ్లాదిమిర్ సాల్డో తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే నిప్పు అంటుకునే రసాయనాలతో ఈ దాడులు చేశారని, అర్ధరాత్రి వేళ పౌరులే లక్ష్యంగా జరిగిన ఈ ఘటన అత్యంత క్రూరమైనదని ఆయన పేర్కొన్నారు.

Similar News

News February 1, 2026

నెయ్యిని నాభి వద్ద రాస్తే..

image

నెయ్యిని నాభికి అప్లై చేస్తే.. చర్మం పొడిబారడం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పీరియడ్స్ సమయంలో ఉన్నప్పుడు నాభికి గోరు వెచ్చని నెయ్యి అప్లై చేయడం వల్ల క్రాంప్స్ వల్ల కలిగే నొప్పి తగ్గుతుంది. కడుపు ఉబ్బరం, మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. ఫెర్టిలిటీ సమస్యలపై కూడా ఇది సానుకూల ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు నెయ్యిలో ఉన్నాయి.

News February 1, 2026

పోలవరం ఎత్తు తగ్గింపుతో తీరని నష్టం: బుగ్గన

image

AP: పోలవరం ఎత్తు 41.15 మీటర్లకు తగ్గిస్తున్నట్లు కేంద్రం పదేపదే చెబుతున్నా రాష్ట్రం తలూపుతూ ఊరుకోవడం సరికాదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. దీనివల్ల భవిష్యత్తులో నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి ఎత్తు 45.72M అన్నారు. కాగా బడ్జెట్ నిరాశపర్చిందని YCP MP అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. పోలవరానికి ₹3వేల కోట్లే ఇచ్చారని, ఇలా అయితే అది ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు.

News February 1, 2026

బంగ్లాదేశ్‌కు ఇండియా ‘బడ్జెట్’ షాక్!

image

బడ్జెట్ 2026-27లో బంగ్లాదేశ్‌కు ఇండియా ఇచ్చే ఫండ్స్‌లో భారీగా కోత పెట్టింది. గతేడాది ₹120 కోట్లు కేటాయించగా ఈసారి దాన్ని సగానికి తగ్గించి ₹60 కోట్లు మాత్రమే ఇచ్చింది. బంగ్లాలో మైనారిటీలపై దాడులు పెరగడం, అక్కడి ప్రభుత్వం పాక్‌తో దోస్తీకి యత్నించడం వంటి కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్‌లోని చాబహార్ పోర్ట్ ప్రాజెక్టుకు కూడా ఇండియా నిధులు కేటాయించలేదు.