News December 30, 2024
కొత్త సీఎస్‌ది కడప జిల్లానే!

రాష్ట్ర నూతన చీఫ్ సెక్రటరీగా నియమితులైన కె.విజయానంద్ మన జిల్లాకు చెందిన వారే. కడప జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె ఆయన స్వస్థలం. 1965లో జన్మించారు. అనంతపురం జేఎన్‌టీయూ నుంచి ఎంటెక్ పూర్తి చేశారు. 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన విజయానంద్ జనవరి 1వ తేదీన సీఎస్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక సీఎస్‌గా ఉన్నారు.
Similar News
News September 13, 2025
మైదుకూరు: తల్లీబిడ్డ మిస్సింగ్

మైదుకూరుకు చెందిన ముత్తరాయపల్లెలో నివసించే మేకల సుమతి (22) తన రెండేళ్ల కుమారుడు చందుతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీనిపై భర్త చెండ్రాయుడు, ఆమె తల్లి మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. సుమతి ఆచూకీ తెలిసినవారు మైదుకూరు సీఐ (9121100618), ఎస్సై(9121100619)కు సమాచారం ఇవ్వాలని కోరారు.
News September 12, 2025
కడప: RI వీరేశంను సన్మానించిన ఎస్పీ

కడప జిల్లా పోలీసు శాఖకు RI వీరేశ్ ఎంతగానో సేవలు అందించాలని జిల్లా SP అశోక్ కుమార్ ప్రశంసించారు. శుక్రవారం బదిలీపై చిత్తూరుకు వెళ్తున్న ఆర్ఐ వీరేశ్‌కు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ అప్పగించిన విధులను సమర్ధవంతంగా నిర్వర్తించారన్నారు. వీఐపీల రాక సందర్భంలో ఆర్‌ఐ వీరేశ్ అంకితభావంతో విధులు నిర్వర్తించారన్నారు.
News September 12, 2025
భూ సమస్యలపై త్వరిత పరిష్కారం: ఆదితిసింగ్

కడప కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్, జేసీ ఆదితిసింగ్ అధికారులకు కీలక సూచనలు చేశారు. భూ సంబంధిత ఫిర్యాదులకు బాధ్యతాయుతంగా స్పందించి, వచ్చే నెలలోపు పెండింగ్ ఫిర్యాదులను “సున్నా” స్థాయికి తగ్గించాలని ఆదేశించారు. సెక్షన్ 22-ఏ డెలిషన్, అసైన్డ్ భూముల పరిష్కారంలో క్షేత్రస్థాయి విచారణ తప్పనిసరని పేర్కొన్నారు.