News July 11, 2024

కొనకనమిట్ల: రైల్వే గేట్మెన్ సమయస్ఫూర్తి.. తప్పిన ప్రమాదం

image

రైల్వే లైన్మెన్ వల్ల పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. పెదరికట్లకు చెందిన చల్లా వెంకటేశ్వర్లు అమ్మనబ్రోలు రైల్వే గేట్మెన్‌గా పని చేస్తున్నారు. బుధవారం రాత్రి 11:17 గంటల సమయంలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు వస్తున్న సమయంలో పట్టాల మధ్య గ్యాప్‌ని గమనించి రెడ్‌ లైట్ వేశారు. దీంతో లోకో పైలట్ సమస్యను ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్లారు. వెంకటేశ్వర్లు సమయస్ఫూర్తిని మెచ్చి గురువారం సన్మానమిచ్చారు.

Similar News

News October 1, 2024

అక్టోబర్ 2 నుంచి గ్రామ సభలు: ప్రకాశం కలెక్టర్

image

ఉపాధి హామీ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేపట్టే పనులను గుర్తించేందుకు అక్టోబర్ 2వ తేదీ గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి సోమవారం మండల స్థాయి అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో ప్రజల అభిప్రాయాలను, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వాస్తవ ప్రణాళికలు రూపొందించాలన్నారు.

కావలిలో రోడ్డు ప్రమాదం.. ప్రకాశం విద్యార్థిని మృతి

image

ప్రకాశం(D) పొన్నలూరు (M) చెరుకూరుకు చెందిన కృపాకర్, మైథిలి అనే ఇద్దరు సోమవారం ఒంగోలు నుంచి నెల్లూరుకు స్కూటీపై వెళ్తుండగా కావలి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. స్థానికులు వెంటనే స్పందించి నెల్లూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మైథిలి మృతి చెందింది. కృపాకర్‌కి తీవ్రగాయాలయ్యాయి. మృతురాలు పదో తరగతి చదువుతోంది. కావలి రూరల్ SI బాజీ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.