News June 26, 2024

కొనసాగుతున్న ‘భగీరథ’ సర్వే

image

రాష్ట్రప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా తీరుతెన్నులపై చేపట్టిన సర్వే ఖమ్మం జిల్లాలో వేగంగా కొనసాగుతోంది. జిల్లాలోని 3.20 లక్షల గృహాలకు గాను 11వ తేదీ నుంచి ఇప్పటివరకు 2,13,883 గృహాల్లో సర్వే పూర్తి చేశారు. తద్వారా 70 శాతం పూర్తి కావడంతో ఇళ్ల వారీగా నల్లా కనెక్షన్లు, సరఫరా, వినియోగం తదితర అంశాలను యాప్లో నమోదు చేస్తున్నారు.

Similar News

News September 29, 2024

మనల్ని మనం ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకోవద్దు: కలెక్టర్

image

యువత ప్రయాణంలో నేటి మెగా జాబ్ మేళా తొలి అడుగు మాత్రమేనని, ఈ రోజు వచ్చే ఉద్యోగం చేస్తూ జీవితంలో మరింత ఉన్నత స్థితికి చేరుకునేందుకు నిరంతరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం SR&BGNR డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. మనల్ని మనం ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకోవద్దని కలెక్టర్ సూచించారు.

News September 28, 2024

కొత్తగూడెం: ఆస్తమాతో ఇద్దరు చిన్నారుల మృతి

image

పినపాక మండలం మద్దులగూడెంలో శనివారం సాయంత్రం ఇద్దరు పసి పాపలు ఆస్తమాతో మృతి చెందారు. చిన్నారుల తల్లిదండ్రుల వివరాలిలా.. మద్దులగూడెం ఎస్టీ కాలనికి చెందిన ఇరుప మహేష్, మంజులకు రెండు నెలల బాబు.. పండా ప్రసాద్, మరియమ్మల రెండు నెలల పాప ఆస్తమాతో మృతి చెందారు. భద్రాచలం ఆసుపత్రిలో చూపించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల మృతితో వారి కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News September 28, 2024

ఖమ్మం ఖిల్లాకు కలెక్టర్.. రోప్ వే స్థల పరీశీలన

image

ఖమ్మం ఖిల్లా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందేందుకు రోప్ వే ఏర్పాటు చేయనున్నట్లు పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ ప్రకాశ్ రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి రోప్‌వే ప్రతిపాదన స్థలాన్ని, జాఫర్ బావిని పరిశీలించారు.