News April 4, 2025

కొనసాగుతున్న EAPCET దరఖాస్తుల ప్రక్రియ

image

JNTU యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న TS -EAPCET 2025 ప్రవేశ పరీక్షకు సంబంధించి దరఖాస్తులు ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా సాయంత్రానికి 2,91,965 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇంజినీరింగ్‌కు సంబంధించి 2,10,567, అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించి 81,172, రెండు విభాగాలకు సంబంధించి 226 దరఖాస్తులు వచ్చాయన్నారు.

Similar News

News September 15, 2025

సంగారెడ్డి: 17 నుంచి మహిళలకు వైద్య శిబిరాలు

image

స్వాస్త్ నారి- స్వశక్తి పరివార్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు మహిళలకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల తెలిపారు. 15 రోజులపాటు ప్రతిరోజు 10 వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. వైద్య శిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News September 15, 2025

పలు కాలేజీలు బంద్.. ఎగ్జామ్స్‌కు మినహాయింపు!

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో పలు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే పరీక్షలకు ఈ బంద్ మినహాయింపు ఉంటుందని తెలిపాయి. అయితే మరికొన్ని కాలేజీలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. కాగా ఇవాళ మధ్యాహ్నం ప్రభుత్వంతో చర్చల తర్వాత బంద్‌పై ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది.

News September 15, 2025

అందాల రాణి.. ఆర్మీ ఆఫీసర్‌గా..

image

పుణే (MH)కు చెందిన కాశీష్ మెత్వానీ 2023లో మిస్ ఇంటర్నేషనల్‌ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్నారు. మోడలింగ్, యాక్టింగ్‌లో ఎన్నో ఆఫర్లు వచ్చాయి. అంతేకాదు బయోటెక్నాలజీలో మాస్టర్స్ చేశారు. హార్వర్డ్‌లో PhD ఛాన్స్ వచ్చింది. కానీ వీటిని లెక్క చేయకుండా దేశం కోసం ఆర్మీలో చేరాలనుకున్నారు. 2024లో CDS ఎగ్జామ్‌లో ఆల్ ఇండియా రెండో ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ (AAD)లో పని చేస్తున్నారు.