News November 3, 2025
కొన్ని క్యాచులు ట్రోఫీలను గెలిపిస్తాయి!

క్రికెట్‌లో క్యాచులు మ్యాచులనే కాదు.. <<18182320>>వరల్డ్ కప్<<>>లను కూడా గెలిపిస్తాయి. 1983WC ఫైనల్లో కపిల్ దేవ్ వివ్ రిచర్డ్స్(WI) క్యాచ్ పట్టి తొలి ట్రోఫీని అందించారు. 2024-T20WC ఫైనల్లో డేవిడ్ మిల్లర్(SA) ఇచ్చిన క్యాచ్‌ను సూర్యకుమార్ చాకచక్యంగా అందుకోవడంతో కప్ సొంతమైంది. తాజా WWCలో SA కెప్టెన్ లారాను అమన్‌జ్యోత్ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపడంతో భారత్‌కు అపూర్వ విజయం దక్కింది.
Similar News
News November 3, 2025
మరో 6 నెలలు కాల్పుల విరమణ: మావోయిస్టు పార్టీ

TG: రాష్ట్రంలో శాంతియుత వాతావరణం కొనసాగాలని తెలంగాణ సమాజం కోరుకుంటోందని మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గత మే నెలలో ప్రకటించిన కాల్పుల విరమణను మరో ఆరు నెలలు కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర శాఖ అధికార ప్రతినిధి జగన్ పేరిట ప్రకటన విడుదల చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని శాంతియుత వాతావరణానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తోందని ఆరోపించింది.
News November 3, 2025
THDCలో 40 ఉద్యోగాలు

తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్(THDC) 40 అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి BSc, బీటెక్, BE, MBBS అర్హతగల అభ్యర్థులు NOV 7 నుంచి DEC 6వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.600. SC, ST, PWBDలకు ఫీజు లేదు. స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://thdc.co.in
News November 3, 2025
డిజిటల్ అరెస్టుల పేరిట ₹3వేల కోట్ల లూటీ

దేశంలో డిజిటల్ అరెస్టుల పేరిట ₹3వేల కోట్ల లూటీ జరిగిందని హోమ్ శాఖ సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ స్కామ్ ఛాలెంజింగ్‌గా మారిందని కోర్టు వ్యాఖ్యానించింది. దీన్ని ఉక్కుపాదంతో అణచివేయాల్సిన అవసరముందని న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భూయాన్, JM బాగ్చి అభిప్రాయపడ్డారు. దీనిపై త్వరలోనే ఆదేశాలిస్తామన్నారు. కాగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ మోసాలపై విచారణ బాధ్యతను CBIకి అప్పగించాలని కోర్టు భావిస్తోంది.


