News July 23, 2024
కొప్పర్తికి నిధులు ఇస్తాం: నిర్మలా సీతారామన్
ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు. విశాఖ-చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి నిధులు కేటాయించినట్లు తెలిపారు. నీళ్లు, రోడ్లు, హైవేల అభివృద్ధికై నిధులు కేటాయిస్తున్నట్లు నిర్మలా తెలిపారు.
Similar News
News January 16, 2025
కడప: ‘అధికారులు పొలాలను పరిశీలించాలి’
వ్యవసాయ శాఖ అధికారులు పొలాలు, రైతుల దగ్గరికి వెళ్లడం లేదని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యద ర్శి ఎన్.రవిశంకర్ రెడ్డి ఆరోపించారు. కడప నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన గురువారం మాట్లాడుతూ.. రైతలు సాగు చేసిన పంటలకు సంబంధించిన సలహాలను, సూచనలను అధికారులు ఇవ్వడం లేదన్నారు. దీంతోనే పంటలు పూర్తిగా దెబ్బతిని పోతున్నాయని చెప్పారు. తక్షణమే పొలాలను పరిశీలించాలని కోరారు.
News January 16, 2025
కడప: ఇక పట్నం పోదాం..!
ఉమ్మడి కడప జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లిన జిల్లా వాసులు పండగ కోసం తరలి వచ్చారు. మూడు రోజులు ఎంతో ఎంజాయ్ చేశారు. నిన్న రాత్రి నుంచే పలువురు తిరిగి తమ ఉద్యోగాలకు బయల్దేరారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. రాయచోటి నేతాజీ సర్కిల్ వద్ద అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో బస్సుల కోసం ఇలా ప్రయాణికులు వేచి చూశారు.
News January 16, 2025
తిరుమలలో కడప బాలుడి మృతి
తిరుమలలో కడప బాలుడు చనిపోయాడు. చిన్నచౌక్ ఏరియాకు చెందిన శ్రీనివాసులు, కృష్ణవేణి దంపతులు 13వ తేదీన తిరుపతికి వెళ్లారు. వాళ్లకు 16వ తేదీ వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు కేటాయించారు. ఈక్రమంలో తిరుమల బస్టాండ్ సమీపంలో లాకర్ తీసుకున్నారు. నిన్న సాయంత్రం వారి రెండో కుమారుడు సాత్విక్ శ్రీనివాస్ రాజు(3) ఆడుకుంటూ రెండో అంతస్తు నుంచి పడిపోయాడు. కొండపై ఉన్న అశ్విని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.