News December 26, 2025

కొబ్బరికాయలతో మేడారం వెళ్తున్న లారీ దగ్ధం

image

తాడ్వాయి మండలంలో ఓ లారీ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. మండలంలోని కొడిశెల లింగాల గ్రామాల మధ్య అడవిలో గురువారం రాత్రి కొబ్బరికాయల లోడుతో మేడారం వెళుతుండగా ప్రమాదవశాత్తు లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీకి మంటలు అంటుకొని దగ్ధమైనట్లు అటుగా వెళ్లిన ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 2, 2026

మరోసారి కనిపించిన కిమ్ కుమార్తె.. వారసత్వానికి సంకేతాలా?

image

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్ జు యే మరోసారి బహిరంగంగా కనిపించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా తల్లిదండ్రులతో కలిసి ‘కుమ్‌సుసన్’ స్మారకాన్ని సందర్శించి దేశ మాజీ నేతలకు నివాళులు అర్పించారు. గత మూడేళ్లుగా తండ్రితో పాటు అధికారిక కార్యక్రమాల్లో జు యే పాల్గొంటుండటంతో ఆమెను వారసురాలిగా స్థానిక మీడియా పేర్కొంటోంది. ఇటీవల చైనా పర్యటనలోనూ కనిపించారు.

News January 2, 2026

కొండగట్టు: పవన్ కళ్యాణ్ రాక.. భారీ బందోబస్తు ఏర్పాటు

image

కొండగట్టులో ప్రతి పౌర్ణమికి నిర్వహించే గిరిప్రదక్షిణ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక రెండు ఒకే రోజు కావడంతో రేపు కొండగట్టు భక్తులు, అభిమానులతో కిటకిటలాడనుంది. ప్రతి గిరిప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. అయితే అదే రోజు టీటీడీచే నిర్మిస్తున్న వసతి గదుల శంకుస్థాపనకు పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో దాదాపు 1,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

News January 2, 2026

నెల్లూరు జిల్లాలో 16 పీడీ యాక్టులు

image

నెల్లూరులో 2025లో గంజాయి బ్యాచ్‌కు ఓ వ్యక్తి బలయ్యాడు. అరుణ తర్వాత మరో లేడీ డాన్ కామాక్షి వెలుగులోకి వచ్చింది. వరుస నేరాలపై సీఎం చంద్రబాబు సైతం స్పందించారు. దీంతో పోలీసులు ఎక్కడిక్కడ రౌడీషీట్లు తెరిచారు. 3కంటే ఎక్కువ కేసులు ఉన్నవారిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. 2025లో మొత్తం 16 మందిపై పీడీయాక్ట్, 34మందిపై గంజాయి కేసులు నమోదు చేసి 102 మందిని రిమాండ్‌కు పంపారు. 510 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.