News November 1, 2025

కొబ్బరిపాలతో చర్మ సంరక్షణ

image

వంటల్లో ఎక్కువగా వాడే కొబ్బరి పాలు సౌందర్య సంరక్షణలో కూడా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, కాపర్‌ చర్మంపై మృతకణాలను తొలగిస్తాయి. దాంతో పాటు ముడతలు, మచ్చలు తగ్గించి యవ్వన చర్మాన్ని ఇస్తాయి. మొటిమలు, ఎగ్జిమా, సొరియాసిస్‌ వంటి చర్మ సమస్యలను తగ్గిస్తాయని చెబుతున్నారు. అలాగే వీటిని జుట్టుకు పట్టిస్తే కుదుళ్లను దృఢంగా చేస్తాయని చెబుతున్నారు.

Similar News

News November 2, 2025

టుడే హెడ్ లైన్స్

image

* శ్రీకాకుళంలోని కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. 9 మంది మృతి
* మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున సాయం: మంత్రి లోకేశ్
* ప్రైవేటు ఆలయం అంటూ తప్పించుకోవాలని ప్రభుత్వం యత్నిస్తోంది.: జగన్
* బోరబండ చౌరస్తాకు PJR పేరు పెడతాం: రేవంత్
* 85% మెడికల్ పీజీ మేనేజ్‌మెంట్ కోటా సీట్లు స్థానికులకే: దామోదర
* జూబ్లీహిల్స్ బైపోల్‌లో BRSకే గెలుపు అవకాశం: KK సర్వే

News November 2, 2025

మహేశ్-రాజమౌళి డిఫరెంట్ ప్రమోషన్స్

image

మహేశ్-రాజమౌళి SSMB29 మూవీని చాలా కొత్తగా ప్రమోట్ చేశారు. ‘ఆల్రెడీ NOV వచ్చేసింది.. ఏదో రిలీజ్ చేస్తానన్నారు’ అని మహేశ్ ట్వీట్ చేయడంతో టాపిక్ స్టార్టైంది. ‘చిన్నగా ఒక్కోటి రిలీజ్ చేద్దాం’ అని జక్కన్న అన్నారు. ‘సర్‌ప్రైజ్ ఆ.. పృథ్వీరాజ్ కూడా సర్‌ప్రైజ్ అంటారా?’ అని మూవీలో పృథ్వీరాజ్ ఉన్నారని, రేపు ఆయన పోస్టర్ రిలీజ్ కానుందని చాటింగ్‌లో చెప్పేశారు. ఈ <>ట్వీట్ చాట్‌<<>>లో ప్రియాంక కూడా పాల్గొన్నారు.

News November 2, 2025

ఎందరో నియంతలు పతనమయ్యారు.. తర్వాత రేవంతే: KTR

image

TG: రేవంత్ నకిలీ వాగ్దానాలు, బెదిరింపు రాజకీయాలు జూబ్లీహిల్స్ ఓటమితోనే అంతమవుతాయని KTR వ్యాఖ్యానించారు. ‘500 రోజుల్లో KCR తిరిగి సీఎం అవుతారు. ఎందరో నియంతలు పతనమయ్యారు.. తర్వాత రేవంతే. జూబ్లీహిల్స్‌లో భారీ మెజార్టీతో గెలుస్తాం. రేవంత్ చేసే బెదిరింపు రాజకీయాలకు భయపడేది లేదు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పతనం ఖాయం. రేవంత్‌కు కాంగ్రెస్‌తో ఉన్నది ఫేక్ బంధం. BJPతో ఉన్న‌ది పేగు బంధం’ అని విమర్శించారు.