News December 26, 2025

కొబ్బరి చెట్లకు నీరు ఇలా అందిస్తే మంచిది

image

కొబ్బరి తోటల్లో నేల తేమ ఆరకుండా, భూమి స్వభావాన్ని, వాతావరణాన్ని బట్టి నీటిని సక్రమంగా అందించాలి. డెల్టా ప్రాంతాల్లో నీటిని తోటలలో పారించే పద్ధతిని అనుసరిస్తున్నారు. అయితే ఈ పద్ధతిలో సేద్యపు నీరు ఎక్కువగా వృథా అయ్యి తెగుళ్లు కూడా తొందరగా ఇతర మొక్కలకు వ్యాపించే అవకాశం ఉంది. చెట్ల చుట్టూ పళ్లెం చేసి బేసిన్ పద్ధతి ద్వారా లేదా డ్రిప్ విధానంలో తోటలకు నీటిని అందించడం వల్ల నీటి వృథాను అరికట్టవచ్చు.

Similar News

News December 30, 2025

భక్తులకు ఇబ్బంది కలగకుండా బందోబస్త్: వరంగల్ సీపీ

image

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురష్కరించుకొని దేవాలయాల వద్ద స్థానిక పోలీసులు బందోబస్త్ ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా బారికేడ్లను ఏర్పాటు చేయాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశించారు. ముమ్మరంగా పెట్రోలింగ్‌తో పాటు షీ టీం, క్రైం పోలీసులు నజర్ పెట్టాలని పేర్కొన్నారు.

News December 30, 2025

సిరియా కొత్త కరెన్సీ నోట్లను చూశారా?

image

సిరియా ఆర్థిక వ్యవస్థలో భారీ <<14825249>>మార్పులు<<>> చోటుచేసుకున్నాయి. జనవరి 1 నుంచి కొత్త సిరియన్ పౌండ్ నోట్లను చలామణిలోకి తెస్తున్నట్లు తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. గతంలో నోట్లపై ఉన్న బషర్ అల్-అసద్ చిత్రాలను పూర్తిగా తొలగించింది. నోట్లపై గోధుమలు, పత్తి, ఆలివ్స్, ఆరెంజ్ చిహ్నాలను ముద్రించింది. పాత కరెన్సీ విలువ కోల్పోవడంతో ఆర్థిక స్థిరత్వం కోసం ఈ కొత్త నోట్లను ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది.

News December 30, 2025

T20 WCకు ఇంగ్లండ్ టీమ్.. హిట్టర్‌కు నో ఛాన్స్

image

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న T20 WCనకు ఇంగ్లండ్ జట్టును ప్రకటించింది. హ్యారీ బ్రూక్ కెప్టెన్‌గా 16 మందితో టీమ్‌ను అనౌన్స్ చేసింది. హిట్టర్ లివింగ్‌స్టోన్‌కు జట్టులో చోటు దక్కలేదు.
టీమ్: హ్యారీ బ్రూక్(C), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, కార్సే, సామ్ కరన్, లియం డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జెమీ ఓవర్టన్, రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.