News October 17, 2024

కొమరం భీం ఆశయ సాధన కోసం కృషి చేయాలి: సీతక్క

image

కొమరం భీమ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. కొమరం భీం 84వ వర్ధంతి సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం జోడేఘాట్లో భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కొమరం భీం చేసిన పోరాటం త్యాగం మరువలేనిది అన్నారు. అతని అడుగుజాడల్లో నడవాలి అన్నారు.

Similar News

News October 17, 2024

వాంకిడి: బకెట్‌లో పడి 10 నెలల బాలుడు మృతి

image

 ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వాంకిడి మండలంలో ప్రమాదవశాత్తు పది నెలల బాలుడు బకెట్‌లో పడి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. తేజాపూర్ గ్రామానికి చెందిన గిర్మాజీ- సునీత దంపతుల కుమారుడు తన్వీజ్ ఆడుకుంటూ వెళ్లి బాత్ రూమ్‌లో ఉన్న బకెట్‌లో పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెళ్లి చూసేసరికి బాలుడు మృతి చెంది కనిపించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్సై పోశెట్టి తెలిపారు.

News October 17, 2024

బెల్లంపల్లి: కారు ప్రమాదంలో ప్రముఖ వ్యాపారి మృతి

image

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రాజేష్ కార్వా (42) అనే వ్యాపారి కారు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం..ఇవాళ ఉదయం కారులో హైదరాబాదుకు బయలుదేరిన రాజేష్ సిద్దిపేట-గద్వేల్ మార్గమధ్యలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాజేష్ తీవ్ర గాయాలతో మరణించినట్లు తెలిపారు.

News October 17, 2024

ఆదిలాబాద్: కొమురం భీమ్‌కు KTR నివాళి

image

ఆదివాసీ యోధుడు.. అరణ్య సూర్యుడు.! పోరాటాల పోతుగడ్డ మీద పుట్టిన అడవి తల్లి ముద్దుబిడ్డ కొమురం భీం అని మాజీ మంత్రి KTR (X) వేదికగా పేర్కొన్నారు. దేశం గర్వించదగ్గ గిరిజన తిరుగుబాటు వీరుడు.. గోండు బెబ్బులి.. కొమురం భీమ్‌ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యమ బాటలో.. ఉజ్వల ప్రగతి దారిలో జల్.. జంగల్.. జమీన్ నినాదమే స్ఫూర్తిగా కొమురం భీం ఆశయాల అడుగు జాడల్లో పయనించామన్నారు.